బాలయ్య ఎఫెక్ట్... ‘లియో’కు దెబ్బ? మళ్లీ బేరసారాలు?
విజయ్ ప్రతిష్టాత్మక చిత్ర ‘లియో’ తెలుగు థియేట్రికల్ రైట్స్ నాగ వంశీ తీసుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరరెక్కిస్తున్న క్రేజీ మూవీ ‘లియో’ మీదే అందరి దృష్టీ ఉంది. ఈ సినిమాను తెలుగులో నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సినిమా ద్వారా సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినమా రైట్స్ ని కాస్త ఎక్కువ పెట్టే నాగవంశీ తీసుకున్నట్లు సమాచారం. అయితే ట్రైలర్ కు మిక్సెడ్ రెస్పాన్స్ రావటం, దసరాకు పోటీ ఓ రేంజిలో ఉండటంతో కలెక్షన్స్ పరిస్దితి ఎలా ఉంటుంది..అనుకున్న స్దాయిలో బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి.
‘లియో’తో పాటు ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు కూడా విడదలవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ‘లియో’, ‘భగవంత్ కేసరి’ థియేటర్లలోకి వస్తున్నాయి. తెలుగులో మొదట బాలయ్య సినిమాకే మ్రొగ్గు చూపెడతారు. అందులోనూ ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఈ రెండు భారీ సినిమాలే కాబట్టి థియేటర్ల పంపకంలోనూ సమస్యలు ఉంటాయి. ఎవరు ఎంత అన్నా బాలయ్య సినిమాకే తెలుగులో ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నాగవంశీ తెలుగు వెర్షన్ కు మొదట అనుకున్న రేటు ఇప్పుడున్న పరిస్దితుల్లో వర్కవుట్ కాదని, తగ్గించని నెగోషియోట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరి తగ్గిస్తారా లేక వేరే రకంగా సర్దుబాట్లు ఏమన్నా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
థియేటర్లలో రిలీజ్ తర్వాత రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు కలెక్షన్లను ఈ మూవీ సాధించగలదని అంచనా. పాజిటివ్ టాక్ వస్తే 2.0 రికార్డును (రూ.810 కోట్లు) పైతం ‘లియో’ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘విక్రమ్’లాంటి సూపర్‌హిట్ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంకావడం, ‘మాస్టర్’ తర్వాత లోకేశ్- విజయ్ కాంబోలో రూపొందుతున్న సినిమాకావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్. లియోలో యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్‌గా, సంజయ్ దత్ ఆంటోనీ దాస్‌గా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.