టాలీవుడ్ హాట్ న్యూస్: హీరో, హీరోయిన్ లవ్ ఎఫైర్

New Love Birds In Tollywood
Highlights

ఇటీవల వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ హీరో ఇప్పుడు తన కో స్టార్ తో ప్రేమ 

ఇటీవల వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ హీరో ఇప్పుడు తన కో స్టార్ తో ప్రేమ వ్యవహారం నడిపించడం హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన హార్డ్ వర్క్ తో పేరు తెచ్చుకున్న ఈ హీరో గతంలో కూడా తన తోటి హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపించినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఏది కూడా సీరియస్ రిలేషన్షిప్ కాదు.

తనకున్న బ్యాక్ గ్రౌండ్ వాడుకొని ఇలా హీరోయిన్లతో వ్యవహారాలు నడిపిస్తుంటాడట ఈ హీరోగారు. ప్రస్తుతం తనతో కలిసి పని చేస్తోన్న హీరోయిన్ గా సదరు హీరోగా క్లోజ్ గా మూవ్ అవుతుండడంతో ఇప్పుడు ఆమెతో కూడా ఎఫైర్ నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కూడా షూటింగ్ పూర్తయిన తరువాత ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం, బయట కలిసి తిరగడం వంటివి చేస్తుండడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

అయితే సదరు హీరోయిన్ అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న నటి. ఆమె ఈ హీరో వలలో ఎలా పడిందంటూ చర్చించుకుంటున్నారు. మరి ఈ రిలేషన్ ఎంతకాలం సాగుతుందో చూడాలి!

loader