Asianet News TeluguAsianet News Telugu

కొత్త‌గా ఏమీ లేదు - "ఇద్ద‌రి మ‌ధ్య 18".. మూవీ రివ్యూ

 

  • చిత్రం : ఇద్దరి మధ్య 18
  • దర్శకత్వం : నాని ఆచార్య
  • నిర్మాత : శివరాజ్ పాటిల్
  • సంగీతం : గంటాడి కృష్ణ
  • నటీనటులు : రామ్ కార్తీక్, భాను త్రిపాఠి
  • ఏసియానెట్ రేటింగ్- 2/5

 

 
NEW FILL MISSED AS SAID IN PROMOTIONS

కథ:

అరకు వ్యాలీలో జరిగే ఒక ఇండస్ట్రియల్ టూర్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన మహి (రామ్ కార్తీక్), హిమ (భాను త్రిపాఠి) కలుసుకుంటారు. అక్కడే ఒకరికొకరు బాగా దగ్గరై ఒకే ప్రాజెక్ట్ ను తీసుకుంటారు. అదే జాతీయ భద్రతా అంశాలతో ముడిపడి ఉన్న మిషన్ 18. ఆ మిషన్ ప్రత్యేకత ఏమిటి ? దాన్ని మహి, హిమ లు విజయవంతంగా పూర్తి చేశారా ? ఆ ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? అనేదే  సినిమా కథ.

 

నటీనటులు :

బిత్తిరి సత్తి నుండి భీభత్సమైన కామెడీని ఆశించేవారికి కూడా గట్టి నిరుత్సాహమే ఎదురైంది.హీరో రామ్ కార్తీక్ తన నటనతో పర్వాలేదనిపించినా హీరోయిన్ పాత్రలో భాను త్రిపాఠి మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చింది.హీరోయిన్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ చాలా బాగుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. యాంకర్ బిత్తిరి సత్తి తన తెలంగాణ యాసతో, నాటాతో అక్కడక్కడా మెప్పించాడు.

 

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు నాని ఆచార్య సినిమా ద్వారా ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం, దేశం పట్ల అతనికున్న భాద్యత మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి. హీరో రామ్ కార్తీక్ , సినిమాటోగ్ర‌ఫీ,సినిమాలోని మొదటి పాటను అరకు లొకేషన్లలో చాల బాగా చిత్రీకరించారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్. అందులో ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడంతో చప్పగా సాగింది. సినిమాలోని చాలా సన్నివేశాలను సరైన ముగింపు ఇవ్వకుండానే వదిలేశారు. అది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కాస్త ఎక్కువ చిరాగుగానే అనిపిస్తుంది.

 

చివరగా...

కొత్త జాడీలో పాత చింత‌కాయ ప‌చ్చ‌డి

Follow Us:
Download App:
  • android
  • ios