కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర మరణం సంచలనం రేపింది. ఓ హోటల్ లో ఆమె శవమై కనిపించగా పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ ప్రారంభించారు. కాగా చిత్ర మరణానికి ముందు ఆమెతో నిశ్చితార్ధం జరుపుకున్న హేమనాథ్ ని పోలీసులు విచారిస్తున్నారు. చిత్ర మరణించిన హోటల్ గదిని వీరిద్దరే కలిసి తీసుకోవడంతో ఆయనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర శవంపై గాయాలు ఉన్నప్పటికీ... పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఆమెది ఆత్మహత్యే అని తేలింది.  అయితే చిత్ర తల్లి  హేమనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 


హోటల్ గదిలో చిత్రను హేమనాథ్ కొట్టి చంపారని ఆమె అన్నారు. నిశ్చితార్ధం తరువాత హేమనాథ్ అసలు స్వరూపం బయటపడిందని అన్నారు. దానితో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఆమె తెలిపారు. పెద్దల సమక్షంలో పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్న చిత్ర, హేమనాథ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం కూడా పలు అనుమానాలకు కారణం అయ్యింది. 


ఇది ఇలా ఉంటే హేమనాథ్ తండ్రి చిత్రపై దారుణమైన కామెంట్స్ చేశారు. తన కుమారుడు హేమనాథ్ ని ప్రేమించక మునుపే ముగ్గరిని ప్రేమించారు అన్నారు. ఓ టీవీ యాంకర్ తో పాటు రాజకీయ నాయకుడితో చిత్రకు సంబంధాలు ఉన్నాయి అన్నాడు. అలాగే ఓ అజ్ఞాత వ్యక్తి తరచుగా చిత్రకు ఫోన్ చేసి... వేధించేవాడట. హేమనాథ్ తండ్రి ఆరోపణల నేపథ్యంలో కేసు కొత్త మలుపు తిరుగుతుందోమో చూడాలి.