Asianet News TeluguAsianet News Telugu

ఈసారి 3 వేల కోట్ల సినిమా తీస్తా అంటూ.. అట్లీ కామెంట్స్, ముచ్చటగా మూడోసారి ఆడేసుకుంటున్న నెటిజన్లు

ముచ్చటగా మూడోసారి నెటిజన్లకు దొరికిపోయాడు డైరెక్టర్ అట్లీ.. మరోసారి నోరు జారి హాట్ టాపిక్ అయ్యాడు.  ఆ మధ్య జవాన్ కు  ఆస్కార్ అన్నాడు.. ఆతరువాత హాలీవుడ్ సినిమా అననాడు.. ఇక ఈసారి అంతకు మించిన డైలాగ్ వేశాడు.. ఇంతకీ అట్లీ ఏమన్నారంటే..? 

netizens trolls Once again to jawan movie director atlee jms
Author
First Published Oct 8, 2023, 2:41 PM IST


పిచ్చి పిచ్చి కామెంట్లతో.. రెండు సార్లు నెటిజ్ల చేత ట్రోల్స్ కు గురైన డైరెక్టర్ అట్లీ.. తాజాగా మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్ అయ్యారు. ఈసారి కూడా అట్లీ చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి. నిజంగా ఈ దర్శకుడేనా..జవాన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చింది అని అంతా అనుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కు జవాన్ తో సూపర్ హిట్ ఇచ్చిన అట్లీ.. ఈ మూవీతో 1100 కోట్లు వసూలు చేసింది. అయితే తాజాగా ఆయన  తన నెక్ట్స్ మూవీ ఏకంగా  3000 కోట్లు వసూళు చేయబోతుందన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. వారిద్దరితో సినిమా చేస్తే  3000 కోట్లు ఈజీగా క్రాస్ అవుతుందన్నారు. దాంతో అట్లీ కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. నెటిజన్లకు అయితే కోపం తెప్పించాయి. ఇక వెంటనే తగులుకున్నారు సోషల్ మీడియా జనాలు. 

అట్లీ లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయనతో   ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్నారు. చేయక చేయక1000 కోట్ల సినిమా ఒక్క సారి చేసినందుకే...  ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని మండిపడుతున్నారు. మరి మీరే ఇలా అయిపోతే.. రాజమౌళి లాంటి దర్శకుడు ఇంకెన్ని మాట్లాడాలి అంటూ.. కామెంట్ చేస్తున్నారు. జక్కన్న ఎంత సింపుల్ గా ఉంటారు.. మీరు ఎన్ని మాట్లాడుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి..జవాన్ కు బాబు లాంటి సినిమాలు తెరకెక్కించారనే విషయాన్ని అట్లీ మర్చిపోవద్దని చెప్తున్నారు. రాజమౌళిని  చూసి నేర్చుకుంటే మంచిదని చురకలంటిస్తున్నారు. 

ఇక జవాన్ సినిమాతో బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ.. దాంతో అట్లీ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన జవాన్  సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధించింది. ఈమూవీ తాజాగా 1000 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పఠాన్ తోవెయ్యి కోట్లు సాధించిన షారుఖ్.. జవాన్ తో మరోసారి ఆమార్క్ ను క్రాస్ చేసి.. అరుదైన రికార్డ్ సాధించాడు. 

ఇక ఈసినిమా డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. ఈసినిమా ఇచ్చిన కిక్క్ తో ఏదేదో మాట్లాడుతున్నాడంటూ.. సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో జవాన్ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్తాను అన్న అట్లీ... ఆ విషయంలో ట్రోల్స్ ఫేస్ చేశారు. ఆ వ్యాఖ్యలు చేసి ఎన్నో రోజులు గడవక ముందే..మరోసారి మరోసారి నోరు జారాడు అట్లీ.. రెండో సారి తనకు హాలీవుడ్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని.. వెంటనే రమ్మంటున్నారంటూ  కామెంట్స్ చేశాడు. 

 తాను త్వరలోనే స్పానిష్ సినిమా కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అట్లీ తనకు హాలీవుడ్ సినిమా అవకాశాలు కల్పించారని  చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అట్లీ చేసిన ఈ కామెంట్స్ తో  నెటిజన్స్  రకరకాలుగా స్పందించారు.  ఒక రకంగా అట్లీపై భారీగా  ట్రోల్ చేశారు. సినిమాలను మిక్స్ చేసే జవాన్ సినిమా చేసిన నీకు హాలీవుడ్ అవకాశాలు కల్పించారా ముందు ఊహల నుంచి బయటకురా అట్లీ అంటూ కొందరు కామెంట్ చేయగా, పగటి కలలు కనొద్దంటూ మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios