బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ 'ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్' సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పింది.

సినిమా తనను నిరాశ పరిచిందని మరోసారి ఈ సినిమా చూడాలనుకోవడం లేదని తెలిపింది. ఎవెంజర్స్ సినిమా కాస్త ఆలస్యంగా చూశానని, ఇప్పటికి తనకు సినిమా చూడడానికి వీలు కలిగిందని చెప్పింది. మొదటి నుండి ఎవెంజర్స్ సినిమాకు పెద్ద ఫ్యాన్ అని, అందుకే ఈ సినిమా కూడా చూడాలని ఆశ పడినట్లు చెప్పిన అనసూయ తనను సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పింది.

ఈ సీరీస్ లో ఉన్న మిగిలిన 21 సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తానని కానీ ఈ సినిమా మాత్రం చూడాలనుకోవడం లేదని చెప్పింది. తనకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదో తరువాత చెప్తానని, ఈ విషయాలు చెప్పి అభిమానులను నిరాశ పరచడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు 'చేసింది చాలులే.. ఇంక పో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ 'నువ్ తేడా అని తెలుసు కానీ మరీ ఇంత తేడా అని తెలియదు' అంటూ  కామెంట్ చేయగా.. మరికొందరు వార్తల్లో ఉండడానికి అనసూయ ఇలా కామెంట్స్ చేసిందని అంటున్నారు.