Asianet News TeluguAsianet News Telugu

కొరటాల ట్వీట్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

  • కొరటాల కూడ నిన్న మోదీకి ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం గురించి ఒక ట్వీట్ వేశాడు
  • కొరటాలను చాలామంది పొగిడారు భలే కామెంట్ చేశాడన్నారు
Netizens trolling koratala shiva for tweet against modi

ప్రతి విషయానికి రెండు దారులు ఉంటాయి. ఒకటి మంచి రెండోది చెడు. ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు విమర్శలపాలవుతారు. కొరటాల కూడ నిన్న మోదీకి ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం గురించి ఒక ట్వీట్ వేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై  జరుగుతున్న సమయంలో తన కొత్త సినిమా ‘భరత్ అనే నేను’లోని ‘మ్యాన్’ డైలాగుకు ముడిపెడుతూ ప్రధాని నరేంద్ర మోడీని దర్శకుడు కొరటాల శివ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కొరటాలను చాలామంది పొగిడారు. భలే కామెంట్ చేశాడన్నారు. ఈ కామెంట్ నేపథ్యంలో కొరటాల మీద విమర్శలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. తన సినిమా ప్రమోషన్ కోసమే కొరటాల ఈ కామెంట్ చేశాడని.. మిగతా సమయాల్లో ఇలాంటి చురుకుదనం సెలబ్రెటీలకు ఎందుకు ఉండదని కొందరు కౌంటర్లు వేస్తున్నారు.

ఇన్నాళ్లుగా ప్రజలు చేస్తున్న మీకు కనిపించలేదా.. సినిమా పూర్తయి ఖాలీ అయ్యాక ఇలా మెసేజ్ మెసేజ్ ఇచ్చారా అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే.. ‘‘సినిమా విడుదలకు ముందు మాత్రమే మనకు తెలుగు రాష్ట్రా గుర్తుకొస్తాయి కదా సార్.. వాహ్’’ అంటూ మరో వ్యక్తి కౌంటర్ వేశాడు కొరటాలకు. ఇక మోడీని ప్రశ్నిస్తున్న కొరటాల.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రం ప్రశ్నించరా అంటూ కూడా పలువురు నిలదీశారు. చంద్రబాబు కూడా హామీల విషయంలో జనాల్ని మోసం చేశారని.. దమ్ముంటే ఇలాగే చంద్రబాబును కూడా ప్రశ్నించాలని ఒక నెటిజన్ సవాలు విసిరాడు. దేనికైనా రెండో కోణం ఉంటుంది. తన కామెంట్ విషయంలో ప్రశంసల్ని ఎంజాయ్ చేస్తున్న కొరటాల ఈ కామెంట్లను ఎలా తీసుకుంటున్నాడో మరి.

Follow Us:
Download App:
  • android
  • ios