దీంతో రివ్యూలను పట్టించుకోకుండా తమ సినిమా చూడాలని నిర్మాతలు ప్రేక్షకులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా... తాజాగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ సినిమాని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు ట్రోలింగ్ కు గురి అవుతోంది. ఇంతకీ సందీప్ ఏమన్నారు అంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిరోజు నుంచి ఈ సినిమాకి డివైడ్ టాక్ నడుస్తోంది. కొంతమందికి ఈ సినిమా బాగా కనెక్ట్ అయినప్పటికీ.. ఓ వర్గం ఆడియన్స్ కి మాత్రం సినిమా పెద్దగా నచ్చలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే కొంతమంది క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. దీంతో రివ్యూలను పట్టించుకోకుండా తమ సినిమా చూడాలని నిర్మాతలు ప్రేక్షకులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా... తాజాగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ సినిమాని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు ట్రోలింగ్ కు గురి అవుతోంది. ఇంతకీ సందీప్ ఏమన్నారు అంటే..
ముందుగా 'పుష్ప' సినిమాను మెచ్చుకుంటూ వరుసగా ట్వీట్స్ వేశారు సందీప్ రెడ్డి. 'పుష్ప' సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని.. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలని అన్నారు. సినీ చరిత్రలోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో ఒకటిగా అల్లు అర్జున్ పోషించిన పాత్ర నిలిచిపోతుందని అన్నారు. నోట్ అంటూ.. ఓ లైన్ రాసుకొచ్చారు సందీప్ రెడ్డి. అదేంటంటే.. ఈ సినిమాకి రేటింగ్స్ ఇచ్చే హక్కు ఫిలిం మేకర్స్ కి మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినిమాకి వందకు వంద మార్కులేశారు సందీప్ రెడ్డి.
ఈ కామెంట్స్ పై నెట్ జనులు కొందరు చిరాకు పడుతున్నారు. తెరమీదే కాదు తెరవెనక కూడా ఇలా సందీప్ వంగా తన యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటున్నారు. పుష్పని పొగడొచ్చు..నచ్చచ్చు కానీ ఇలా ఫిల్మ్ మేకర్స్ కు మాత్రమే రేటింగ్ ఇచ్చే హక్కు ఉందని అనటం సబబు కాదంటున్నారు. ఈ రోజు సోషల్ మీడియాలో అందరూ సినిమాని నిష్పక్షపాతంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు రివ్యూ రైటర్ లాగ ఎనాలసిస్ చేస్తున్నారు. నచ్చినవాళ్లు మెచ్చుకుంటున్నారు. నచ్చనవాళ్లు ఏకిపారేస్తున్నారు. రేటింగ్స్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో రేటింగ్ అనేది కేవలం రివ్యూ రైటర్స్ కే పరిమితం కాలేదు. దాంతో నెట్ జనులు ..సందీప్ వంగా ఓవర్ యాక్షన్ అంటున్నారు ఇలా మాట్లాడటాన్ని. మరో ప్రక్క 'పుష్ప' సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు అంటూ హడావిడి చేస్తోంది. ఇప్పుడు గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను ప్లాన్ చేస్తోంది.
also read: Samantha : 'ఊ అంటావా' సాంగ్ పై సమంత హాట్ కామెంట్స్.. బన్నీపై ప్రశంసల వర్షం
