ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లపై ప్రభావం పడలేదు. దీనితో పుష్ప చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లపై ప్రభావం పడలేదు. దీనితో పుష్ప చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ తన నటన, గెటప్ తో అభిమానులని అలరించాడు. ఈ చిత్రంలో బన్నీ నటన అదుర్స్ అంటూ యునానిమస్ రెస్పాన్స్ వస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక ఈ చిత్రంలో యువతని ఆకర్షించిన మరో అంశం Samantha తొలిసారి చేసిన ఐటెం సాంగ్. 'ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ' అంటూ మాస్ బీట్ తో దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. వెండితెరపై మాస్ ప్రేక్షకులని అకరించే విధంగా ఉంది. సమంత హాట్ హాట్ గా కనిపిస్తూ బన్నీతో చిందులేసింది. 

ఈ సాంగ్ పై సమంత ఇన్స్టాగ్రామ్ లో తాజాగా ఓ పోస్ట్ పెడుతూ హాట్ కామెంట్స్ చేసింది. 'నేను మంచి పాత్రల్లో నటించాను, చెడు పాత్రల్లో కూడా నటించాను, కామెడీ రోల్స్, సీరియస్ రోల్స్ లో నటించాను. ఈ పాత్రల కోసం నేను హార్డ్ వర్క్ చేశాను. కానీ ఇలా హాట్ గా కనిపించాలంటే మాత్రం హార్డ్ వర్క్ నెక్స్ట్ లెవల్ లో ఉండాలి. ఈ సాంగ్ పై మీ ప్రేమకు ధన్యవాదాలు ' అని సమంత పోస్ట్ చేసింది. 

View post on Instagram

తాను ప్లే చేసిన రోల్స్ లో ఐటెం సాంగ్ లో హాట్ గా కనిపించడమే అన్నింటికంటే కష్టం అని సమంత చెబుతోంది. అలాగే సమంత అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ మరో పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ నటన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా, ప్రతి సెకండ్ ఆస్వాదించేలా ఉంది. ఇలాంటి పాత్రలు ఆదర్శవంతంగా నిలుస్తుంటాయి. అసాధ్యం అనిపించే రోల్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. డైలాగ్ డెలివరీ నుంచి ఒక షోల్డర్ కిందికి దించి నటించడం వరకు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది అంటూ సమంత బన్నీపై ప్రశంసలు కురిపించింది. 

View post on Instagram

సమంత ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. అలాగే సాంగ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటలో మగవాళ్లందరి బుద్ది ఒకే విధంగా ఉంటుంది.. శృంగారం కోసమే వాళ్ళు అనే విధంగా లిరిక్స్ ఉన్నాయి. దీనితో పురుషుల సంఘం ఈ సాంగ్ పై కేసు కూడా నమోదు చేశారు. 

Also Read: Shyam Singha Roy:స్టోరీ లైన్ లీక్, 'చంద్రముఖి' టైప్ స్క్రీన్ ప్లే ? పునర్జన్మ కాదు