Asianet News TeluguAsianet News Telugu

అక్షయ్ కుమార్ పై మండిపడుతున్న నెటిజన్లు, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

సోషల్ మీడియా వల్ల స్టార్ సెలబ్రెటీలకు ఎంత లాభమో.. అంత నష్టం కూడా తప్పడంలేదు. ఒక్కోసారి స్టార్లు చేసే పనికి నెట్టింట గట్టిగా వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంటారు కూడా. ప్రస్తుతం ఈ పరిస్థితి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు వచ్చింది. 

netizens slam Bollywood Hero Akshay Kumar
Author
First Published Feb 7, 2023, 5:06 PM IST

సోషల్ మీడియా వల్ల స్టార్ సెలబ్రీటిలకు ఎంత లాభమో.. అంత నష్టం కూడా తప్పడంలేదు. ఒక్కోసారి స్టర్లు చేసే పనికి నెట్టింట గట్టిగా వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంటారు కూడా. ప్రస్తుతం ఈ పరిస్థితి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు వచ్చింది.  

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌పై సోషల్ మీడియా జనాలు మండి పడుతున్నారు. ఆయన పట్ల నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్స్ ను ఇన్సల్ట్ చేశారంటూ.. నెటిజన్లు ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. అక్షయ్ కుమార్  చేసిన ఓ పోస్ట్ ఇంత రచ్చకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలో తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఈ వివాదానికి మూలంగా మారింది. 

అక్షయ్ కుమార్ తన ఉత్తర అమెరికా టూర్ ప్రమోట్ చేస్తూ ఓ ట్విట్ చేశారు. ఆ ట్వీట్ లో ఈ విధంగా రాస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఉత్తర అమెరికా ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు ది ఎంటర్‌టైనర్స్ సిద్ధంగా ఉంది. మీరంతా కూడా సిద్దంగా ఉండండి. మార్చిలో మేము మీ ముందుకు వస్తున్నాం అంటూ ట్వీట్ చేసిన ఆయన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. ఈ వీడియోలో అక్షయ్ ఓ పొరపాటు చేశాడు. 

 

ఈ వీడియోలో అక్షయ్ కుమార్‌తో పాటూ దిశ పటానీ, నోరా ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు ఉన్నారు. అయితే.. వీడియోలో వారంతా షూ వేసుకుని గ్లోబ్‌పై నడవడంతో వివాదం రాజుకుంది. అందంతా ఒక ఎత్తు అయితే .. హీరో అక్షయ్ కుమార్ ఐతే ఏకంగా గ్లోబ్‌పైనున్న ఇండియా మ్యాప్ పై షూ వేసుకుని నడుస్తున్నట్టు వీడియోలో కనిపించడంతో అది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఇక వరుస పెట్టి అక్షయ్ కుమార్ ను తగులుకున్నారు నెటిజన్లు. గట్టిగీ అక్షింతలు వేస్తున్నారు. 

బూట్లతో మనదేశ మ్యాప్‌పై నడవడం నీకు సిగ్గుగా అనిపించట్లేదూ..అంటూ ఫైర్ అవుతున్నారు. కొందరు ఇంతకంటే ఎక్కువగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాతృభూమిని కాస్తయినా గౌరవించాలి కదా అంటై హితవు పలికారు. మరికోందరు నిరసన.. ఇంకొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయులను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం ఈ కాంట్రవర్సీతో పాటు.. అక్షయ్ కుమార్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అక్షయ్ కుమార్‌.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆక్రమంలో రీసెంట్ గా సెల్ఫ.. అనే సినిమాలో నటించాడు అక్షయ్. అంతే కాదు  ఓ మైగాడ్ 2 తో పాటూ మరో నాలుగు సినిమాల్లో అక్షయ్ నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios