`ఆర్‌ ఆర్‌ ఆర్‌` ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. `రామరాజుఫర్‌ భీమ్‌` అనే యాష్‌ ట్యాగ్‌లో ట్విట్టర్‌లో మోతమోగుతుంది. కొమురంభీమ్‌ యాష్‌ట్యాగ్‌ సైతం ట్విట్టర్‌ని షేక్‌ చేస్తుంది. ఎన్టీఆర్‌ అభిమానులు, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ మొత్తంగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` ఫ్యాన్స్  ట్వీట్లు, షేరింగ్‌, రీట్వీట్లతో హంగామా చేస్తున్నారు. 

చెప్పినట్టుగానే గురువారం రాజమౌళి.. `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్‌ నటిస్తున్న `కొమురంభీమ్‌` పాత్ర టీజర్‌ని విడుదల చేశారు. గోండ్రు బెబ్బులిగా ఎన్టీఆర్‌ తన విశ్వరూపం చూపించారు. సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసేలా సన్నివేశాలు కూడా మెప్పించారు. చివర్లో ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా కాకుండా ఓ ముస్లీం వేషదారణతో రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లుక్‌ విశేషంగా వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే ఈ టీజర్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ అస్సలు బాలేదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. చెర్రీ వాయిస్‌ ఓవర్‌లో బేస్‌ లేదని, ఊహించిన విధంగా లేదని అంటున్నారు. అదే సమయంలో చివర్లోని సీన్‌ మైనస్‌ అంటున్నారు. 

మరోవైపు టీజర్‌పై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. బేసిక్‌గా రాజమౌళి సినిమాలంటే అందులో చాలా వరకు కాపీ సన్నివేశాలుంటాయనే విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి విమర్శలే వస్తున్నాయి. సముద్రంలో అగ్ని పర్వతం పేలే సీన్‌ ఓ టీవీ ఛానెల్‌లోనిదని  ఆధారంతో సహా చూపిస్తున్నారు. పర్వతాల మధ్య మేఘాల సన్నివేశం కూడా కాపీనే అని పోస్ట్ లు పెడుతున్నారు. బహుశా రాజమౌళికి రియల్‌ లొకేషన్లలో చిత్రీకరించే టైమ్‌ లేక ఇలా కాపీ కొట్టారని అంటున్నారు. జియోగ్రాఫికల్‌ ఛానెల్‌లోనుంచి తీశారని చెబుతున్నారు.

ఇదంతా ఓ ఎత్తైతే.. రామ్‌చరణ్‌ పాత్రతో పోలిస్తే, ఎన్టీఆర్‌ పాత్రని బాగా చూపించారని రెండు పాత్రలకు న్యాయం చేయలేదని అంటున్నారు. రెండు పాత్రలను ఈక్వల్‌గా చూపించాలని కామెంట్‌ చేస్తున్నారు.