'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సి.కళ్యాణ్ సినిమా అలానే రవితేజ సరసన నటించే మరో సినిమా ఉన్నాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా పాయల్ కనిపించనుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ నటించిన 'జీరో' సినిమాపై చేసిన కామెంట్స్, ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియా మీడియాలో వైరల్ అయ్యాయి.

సినిమాను సాగదీసి చూపించారని, భరించడం కష్టమే అన్నట్లు ఆమె కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఒక్క హిట్టు వస్తే స్టార్ హీరో సినిమాను కామెంట్ చేసే రేంజ్ కి వెళ్లిపోయావా అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. షారుఖ్ పై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. 

దీంతో తనపై నెగెటివిటీని తగ్గించుకోవడం కోసం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను షారుఖ్ నటన గురించి మాట్లాడలేదని, సినిమాలో కథ, కథనాల గురించి మాత్రమే చెప్పానని.. తాను  షారుఖ్ కి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ సాగాదీసారని అంతేతప్ప మిగిలిన సినిమా అంతా బాగుందని వెల్లడించింది.