మెగాడాటర్ నీహారిక మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసింది. ఆ తరువాత వెబ్ సిరీస్ లో నటిస్తూ తనకంటూ కొంత పాపులారిటీ సంపాదించింది. 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నిహారికకు తొలి చిత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది.

ఆ తరువాత 'హ్యాపీ వెడ్డింగ్' అంటూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈసారి కొత్తగా ట్రై చేద్దామనుకొని ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదే 'సూర్యకాంతం' సినిమా. విడుదలకు ముందు ప్రమోషన్స్ తో కాస్త హైప్ తీసుకొచ్చింది కానీ సినిమా చూసిన వారు పెదవి విరుస్తున్నారు. 

వెబ్ సిరీస్ కథను సినిమాగా తీస్తే ఇలానే ఉంటుందని విమర్శిస్తున్నారు. సినిమాలో సరైన కథా, కథనాలు లేక ఆకట్టుకోలేకపోయిందని టాక్. పైగా సినిమాలో నీహారిక నటన కాస్త అతిగా ఉందని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తను హీరోయిన్ మెటీరియల్ కాదని నీహారికకి తెలిసినప్పుడు నటన మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ భామ మాత్రం తనకొచ్చిన నటనతో విసిగించేసింది.

దీంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్స్ చేసేవారు ఎక్కువయ్యారు. ముందు నటించడం నేర్చుకో.. ఆ తరువాత సినిమాలు చేసుకో.. అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి తన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా రాని నెగెటివ్ కామెంట్స్'సూర్యకాంతం'తో వస్తుండడంతో అమ్మడు షాక్ అవుతుంది. హిట్ అవుతుందనుకున్న సినిమాకి ఇలాంటి రిజల్ట్ రావడంతో తట్టుకోలేకపోతుంది.