దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

'వెండితెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి బయోపిక్ లో రెండవ భాగం 'మహానాయకుడు' చిత్ర ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానాయకుడుగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి' అంటూ ట్వీట్ చేశాడు. 

ఇది చూసిన కొందరు నెటిజన్లు నారా లోకేష్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. 'మహానాయకుడు' అసలైన బయోపిక్ కాదని.. వర్మ తీస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రియల్ బయోపిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆయన(ఎన్టీఆర్) పార్టీని దొంగిలించి దొంగ పాలన చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. 

'ఇలా సెల్ఫ్ డబ్బాలు కొట్టే.. ఫస్ట్ పార్ట్ ని ముంచారు.. కొంచెం ఓపిక పట్టండి సామీ' అంటూ ట్రోల్ చేస్తున్నారు.