ఈ మధ్యకాలంలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు స్టేజ్ మీద తన సినిమా మీదున్న అతి నమ్మకంతో రిలీజ్ కి ముందే గొప్పలకు పోతున్నారు. మొన్నటికి మొన్న దిల్ రాజు 'శ్రీనివాస కళ్యాణం' గురించి తెగ పొగిడేశాడు. ఈ సినిమా నచ్చని వారుండరని, బొమ్మరిల్లు సినిమాను మించిపోతుందని ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశాడు. తీరా సినిమా చూసిన ఆడియన్స్ పెదవి విరిచారు.

అయినప్పటికీ ఆగకుండా సినిమాను ప్రమోట్ చేశాడు దిల్ రాజు. ఇప్పుడు అటువంటి పరిస్థితే నాగశౌర్యకి కూడా ఎదురైంది. తను నటించిన 'నర్తనశాల' సినిమాకి సంబంధించిన ఓ ఫంక్షన్ లో 'సినిమా నచ్చితే పది మందికి చెప్పండి. నచ్చకపోతే 20 మందికి చెప్పండి' అంటూ నాగశౌర్య స్టేజ్ మీద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. ఇప్పుడు సినిమాను చూసిన ఆడియన్స్ నాగశౌర్య చెప్పినట్లుగా సినిమా చూడొద్దని 20 మందికి చెప్పాలా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అసలు రెండో వారానికైనా ఈ సినిమా థియేటర్ లో ఉంటుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాను తన సొంత బ్యానర్ మీద నిర్మించుకోవడంతో ఆర్థికంగా కూడా భారీ నష్టాలను ఎదుర్కొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముందుగానే ఈ సినిమాను లాభాలకు అమ్మినట్లు వార్తలు వచ్చినా.. సినిమా పబ్లిసిటీ కోసమే ఆలా చెప్పినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్త.. 

హద్దులు మీరుతోన్న హీరోల వ్యాఖ్యలు!