Asianet News TeluguAsianet News Telugu

హద్దులు మీరుతోన్న హీరోల వ్యాఖ్యలు!

తము నటించిన సినిమా మీద ఏ హీరోకైనా నమ్మకం ఉండడం సాధారణం. ఆ విధంగానే సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. మా సినిమాలు ఆదరించండి అంటూ ప్రేక్షకులను కోరుతుంటారు.

naga shourya bold statement on narathansala cinema
Author
Hyderabad, First Published Aug 25, 2018, 1:01 PM IST

తము నటించిన సినిమా మీద ఏ హీరోకైనా నమ్మకం ఉండడం సాధారణం. ఆ విధంగానే సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. మా సినిమాలు ఆదరించండి అంటూ ప్రేక్షకులను కోరుతుంటారు. కానీ గత కొద్దికాలంలో హీరోల స్టేట్మెంట్స్ హద్దులు మీరుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమా సమయంలో విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అవుతుందని తనతో ఎవరైనా బెట్ వేస్తే.. తన అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తానని అన్నారు.

అప్పట్లో విజయ్ చేసిన అతిపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయి. కానీ సినిమా హిట్ అవ్వడంతో అందరూ మర్చిపోయారు. ఆ తరువాత RX 100 సినిమా హీరో ప్రమోషన్స్ లో హద్దులు మీరి మాట్లాడాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇలానే జరిగింది.నితిన్ తన కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుందంటూ స్టేట్మెంట్ విసిరాడు. కానీ సినిమా రిజల్ట్ బోల్తా కొత్తడంతో సైలెంట్ అయిపోయాడు.

ఇక తాజాగా నాగశౌర్య వంతు వచ్చింది. అతను నటించిన 'నర్తనశాల' సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని, నచ్చకపోతే అసలు చూడద్దంటున్నాడు. నచ్చితే మాత్రం సినిమా బాగుందని పది మందికి చెప్పి ప్రోత్సహించమని కోరాడు. హీరోలు స్టేజ్ ల మీద ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు సినిమా హిట్ అయితే ఓకే లేదంటే మాత్రం సోషల్ మీడియాలో వారు చెప్పిన స్టేట్మెంట్స్ ని గుర్తు చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు నెటిజన్లు. ఇకనైనా హీరోలు హద్దులు మీరకుండా కంటెంట్ పరంగా సినిమాను ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios