ఐటెం సాంగ్స్ చేయనంటూ ఎందుకు చేశావు... అయినా ఆ లిరిక్స్ ఏమిటీ అంటూ... ఓ నెటిజెన్ అనసూయను ప్రశ్నించారు. సదరు నెటిజెన్ ప్రశ్నకు అనసూయ సోషల్ మీడియా ద్వారానే సమాధానం ఇచ్చారు. 


కార్తికేయ హీరోగా తెరకెక్కిన చావు కబురు చల్లగా మూవీలో అనసూయ ఓ ఐటెం సాంగ్ లో ఆడిపాడారు. 'లోన లొటారం పైన పటారం' అనే లిరిక్స్ తో సాగిన ఆ పాట లిరికల్ వీడియో విడుదల కావడం జరిగింది. 


ఆ పాటను, ఆ పాటలోని డబుల్ మీనింగ్ కలిగిన లిరిక్స్ ని ఉద్దేశిస్తూ... గతంలో మీరు ఐటెం సాంగ్ చేయనని చెప్పారు. ఐటెం సాంగ్ చేయడమే కాకుండా... దారుణమైన అర్థాలు వచ్చే లిరిక్స్ ఉన్న పాటకు డాన్స్ వేశారంటూ సదరు నెటిజన్ అనసూయను ప్రశ్నించారు. 


ఆ నెటిజెన్ కి అనసూయ ఈ విధంగా సమాధానం చెప్పారు... ఐటెం సాంగ్ అనేది అసలు లేదు. సినిమాలో ఉన్న క్యాస్ట్ కాకుండా ఓ పాటకు వేరే నటి కనిపిస్తే దానిని స్పెషల్ సాంగ్ అంటారు. గతంలో ఆడవాళ్లంటే గౌరవం లేని వాళ్ళు.. స్పెషల్ సాంగ్స్ ని ఐటెం సాంగ్ అంటూ సంబోధించారు.. ఇక ఆ లిరిక్స్ కారణంగానే నేను ఆ సాంగ్ ఒప్పుకున్నా...  అన్నారు. 


అలాగే నేను స్పెషల్ సాంగ్స్ చేయనని ఎప్పుడూ చెప్పలేదు. నా విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న డైరెక్ట్ గా నన్ను అడగవచ్చు.  ఇలా వెటకారంగా కాకుండా హానెస్ట్ గా అడిగితే.. తప్పకుండా సమాధానం ఇస్తాను... అన్నారు. 


ఎవరో రాసిన వాటిని గుడ్డిగా నమ్మి కామెంట్స్ చేయవద్దు. నా కెరీర్ ఎప్పుడు నేను నమ్మిన సిద్ధాంతం, విలువలు ఆధారంగానే ఉంటుంది.. అని ట్వీట్ చేశారు అనసూయ. 

 

అనసూయ అనేక సందర్భాలలో బూతు మాటలు, ఆడవాళ్ళ గౌరవం వంటి విషయాలపై స్పందించడం జరిగింది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని, ఓ బూతు సాంగ్ లో ఎలా నటించావ్ అంటూ సదరు నెటిజన్ ని ఆమెను ప్రశ్నించారు. 

 


మరో వైపు అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది. చేతి నిండా సినిమాలతో పాటు, పలు కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉన్నారు.