అల్లు అర్జున్ పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

First Published 6, Apr 2018, 9:03 AM IST
netigens fire on allu arjun for ccalling modi role model
Highlights
అల్లు అర్జున్ పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఓ శైలిని ప్రదర్శిస్తుంటారు ఎప్పుడూ. మెగా క్యాంప్ హీరోగా వచ్చినా... ఆడియో ఫంక్షన్ లో ‘‘చెప్పను బ్రదర్’’ అన్న ఒక్క మాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నెగిటివ్ అయ్యాడు బన్నీ. అతడు చెప్పింది తప్పా రైటా అన్నది పక్కన పెడితే... చెప్పిన టైం.. ప్లేస్ కరెక్ట్ కాకపోవడంతో బన్నీపై బోలెడన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దాని ప్రభావం దువ్వాడ జగన్నాథమ్ ట్రయిలర్ రిలీజ్ టైంలో స్పష్టంగానే కనిపించింది.

 

అల్లు అర్జున్ మరోసారి అలాంటి తప్పే లేటెస్ట్ గా మళ్లీ చేశాడు. రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ అల్లు అర్జున్ ను కవర్ పేజ్ గా వేసి స్టయిలిష్ స్టార్ ఆఫ్ ది మిలీనియంగా ప్రకటించేసింది. బన్నీ ఇంటర్వ్యూ ప్రచురించింది. ఇందులో అల్లు వారబ్బాయి తనకు ఇని స్పిరేషన్ మోడీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో మోడీ పేరెత్తితే జనాలు మండిపడుతున్నారు. విభజన హామీల అమలులో మోడీ మాట మార్చిన తీరుపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉంది. ఇలాంటి టైంలో మోడీ ఏ రకంగా ఇన్ స్పిరేషనో చెప్పాలంటూ ఓ తెలుగు వాడిగా చెప్పాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

అల్లు అర్జున్ నెమ్మదిగా కోలీవుడ్ లోనూ పాగా వేయాలని చూస్తున్నాడు. బాలీవుడ్.. కోలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అటువైపు తమిళనాడులోనూ భాజపా తీరుపై తంబీలు కోపంగానే ఉన్నారు. అలాంటప్పుడు మోడీ గురించి గొప్పలు చెబితే ఎవరు హర్షిస్తారు? అందుకే నెటిజన్లు మండిపడుతున్నారు.

loader