ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ ఓటీటీ సంస్థ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి, దళపతి విజయ్‌, బాలీవుడ్‌ స్టార్స్ మాధురీ దీక్షిత్‌, హృతిక్‌ రోషన్‌లకు స్పెషల్‌ విషెస్‌ తెలిపింది. ప్రస్తుతం ఇది వైరల్‌అ వుతుంది.

అల్లు అర్జున్‌(Allu arjun) అంటే డాన్సులకు ఫేమస్‌. ఆయన డాన్సులు ఇండియా వైడ్‌గా పాపులర్‌. ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల్లోనూ బన్నీ పాటలకు స్టెప్పులేస్తుంటారు. చిన్నా పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా బన్నీ మూవ్‌మెంట్స్ చేస్తూ రీల్స్ చేస్తున్న సందర్భాలు చాలానే చూశాము. అంతగా ఆయన డాన్సులు పాపులారిటీ పొందాయి. గతేడాది `పుష్ప` చిత్రంతో అదిరిపోయే డాన్సులు చేసి వరల్డ్ ఆడియెన్స్ ని ఫిదా చేశారు బన్నీ. 

ఈ నేపథ్యంలో ఐకాన్‌ స్టార్‌కి ప్రపంచ దిగ్గజ ఓటీటీ(డిజిటల్‌) సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) స్పెషల్‌ విషెస్‌ తెలిపింది. ఏప్రిల్‌ 29 ఇంటర్నేషనల్‌ డాన్స్ డే(International Dance Day). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్‌కి నెట్‌ఫ్లిక్స్ డాన్సర్లకి శుభాకాంక్షలు తెలిపింది. ఒక అంతర్జాతీయ డిజిటల్‌ సంస్థ బన్నీకి స్పెషల్‌గా విషెస్‌ చెప్పడం విశేషంగా నిలుస్తుంది. `అందరికీ ఇంటర్నేషనల్‌ డాన్స్ డే శుభాకాంక్షలు. కానీ వీరికి మాత్రం ప్రత్యేకమైన అభినందనలు` అని ట్వీట్‌ చేసింది పేర్కొంది నెట్‌ఫ్లిక్స్. ఇందులో అల్లు అర్జున్‌ `అల వైకుంఠపురములో` చిత్రంలోని `రాములో రాములా` పాటకి బన్నీ స్టెప్పులేస్తున్న ఫోటోని పంచుకుంది. 

అంతేకాదు మరో ముగ్గురు భారతీయ స్టార్లకి ఈ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపింది నెట్‌ఫ్లిక్స్. ఇందులో దళపతి విజయ్‌(Vijay) కూడా ఉండటం విశేషం. ఆయన స్టెప్పులేస్తున్న దృశ్యాన్ని, అలాగే బాలీవుడ్‌లో గ్రీక్‌ వీరుడు హృతిక్‌ రోషన్‌ ఫోటోని, అలనాటి తార మాధూరి దీక్షిత్‌ డాన్స్ చేస్తున్న ఫోటోని పంచుకుంటూ వీరికి స్పెషల్‌ విషెస్‌ చెప్పడం విశేషం. అల్లు అర్జున్‌ ఇటీవల `పుష్ప` చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆయన `పుష్ప2`లో నటిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

Scroll to load tweet…