Asianet News TeluguAsianet News Telugu

‘బాహుబలి’ నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ షాక్

‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ రెండు భాగాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు, గౌరవాలు దక్కాయి. విడుదలైన ప్రతి దేశంలోనూ రికార్డు కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు.  

Netflix has a shock for Baahubali makers
Author
Hyderabad, First Published Jun 30, 2020, 9:22 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ బాక్స్ ఆఫీస్ దగ్గర  ఏం రేంజిలో రికార్డులు క్రియేట్ చేసి దుమ్ము దులిపిందో తెలిసిన సంగతే. తెలుగు సినిమా స్టామినాను  ప్రపంచానికి చాటింది ‘బాహుబలి’ అని అందరూ మెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు కాను... ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సీరీస్ మొదలెట్టారు. టాలీవుడ్ దర్శకులు ప్రవీణ్ సత్తారు.. దేవా కట్టా ఈ వెబ్ సీరిస్ కు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తునారు. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. ఈ పాటికి ఈ ప్రీక్వెల్ రిలీజ్ అయిపోతుందని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సరికదా..ఇప్పుడు నెట్ ప్లిక్స్ వారు ఈ నిర్మాతలకు, దర్శకులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు రీసెంట్ గా నెట్ ప్లిక్స్ కు సంభందించిన స్క్రీనింగ్ కమిటీ...ఈ సీరిస్ ని మొత్తం చూడటం జరిగింది. అయితే వారు ఇంప్రెస్ కాలేదట. రాజమౌళి డైరక్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ మిగతా మిగతావి తమకు సంతృప్తిగా లేవని, చాలా మార్పులు సూచించారట. ప్రొడక్షన్ హౌస్ కు కూడా తమ స్టాండర్డ్స్ కు తగినట్లు అవుట్ పుట్ లేదని, టీమ్ ని మళ్లీ వర్క్ చేయమని చెప్పారట. అంతేకాదు కొంత ఫండింగ్ కూడా ఆపు చేసారని తెలుస్తోంది. అంతేకాకుండా విఎఫ్ ఎక్స్ వర్క్ కూడా నచ్చలేదని, ఎక్సపెక్టేషన్స్ కు రీచ్ కాలేదని వివరించారట. దాంతో ఇప్పుడు దేవకట్టా, ప్రవీణ్ సత్తారు కలిసి రిపేర్లు ప్రారంభించారట. 

బాహుబలితో ఈ వెబ్ సీరిస్ ని పోల్చి చూడటం వలనే ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. ప్రభాస్, రమ్యకృష్ణ,అనుష్క,సత్యరాజ్ వంటి స్టార్ కాస్టింగ్ తో తీసిన బాహుబలిని...వెబ్ సీరిస్ తో పోల్చి చూడటం వలనే స్టాండర్డ్స్ లేవని అనిపిస్తోందని ఇండస్ట్రీ టాక్. ఏదైమైనా పెట్టబడి పెట్టి, రిలీజ్ చేసేవారు చెప్పినట్లు వినాలి కాబట్టి మళ్లీ నిర్మాతలు, దర్శకులు రంగంలోకి దిగారట. రాజమౌళి కూడా కొంతమేరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. 

 ఆర్కా మీడియా వారు.. రాజమౌళి ఈ వెబ్ సీరిస్ కు సహా నిర్మాతలు. ఆనంద్ నీలకంఠంన్ అనే రచయిత రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే పాపులర్ బుక్ ఆధారంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది.ఈ వెబ్ సీరీస్ లో మొత్తం 13 ఎపిసోడ్స్ ఉంటాయి.  ఒక్కో ఎపిసోడ్ కు నెట్ ఫ్లిక్స్ వారు రూ. 10 కోట్ల బడ్జెట్ కేటాయించారట. దీన్ని బట్టి ఈ వెబ్ సీరీస్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఇద్దరూ డైరెక్టర్లు ఈ వెబ్ సీరీస్ ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుతుందట. ప్రవీణ్ సత్తారు.. దేవా కట్టా ఇద్దరూ తమ సినిమాలు డైరెక్ట్ చేసేందుకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఇది చాలా ఎక్కువట.  ఎలాగూ బాహుబలి బ్రాండ్ ఉంది కాబట్టి ప్రేక్షకులు చూస్తారు. భారీ వ్యూస్ వస్తాయి. థియేటర్ రిలీజ్ టైపులో హిట్లు ఫ్లాపుల గొడవ ఉండదు. అంటే వెబ్ సీరీస్ ష్యూర్ షాట్ హిట్ అన్నట్టు. నెట్ ఫ్లిక్స్ వారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేస్తారు కాబటి వెబ్ సీరీస్ కు మంచి పేరు వస్తే ఇద్దరి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అంచనాలు వేసి, అందుకు తగినట్లు లేకపోవటంతో నిరాశ చెందినట్లు చెప్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios