ఓటీటీలో కుమారి ఆంటీ, డాక్యుమెంటరీ ఫిల్మ్ కు రెడీ అవుతున్న నెట్‌ఫ్లిక్స్‌..?

సోషల్ మీడియా పుణ్యమా అని బాగా పాపులర్ అయ్యింది కుమారి ఆంటి. ఇక తాజాగా కర్రీపాయింట్ ఆంటీ ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవల్ కు వెళ్ళింది. 

Netflix Announced  Documentary On Kumari Aunty JMS

నెట్టింట ఈమధ్య చాలా పాపులర్ అయ్యింది కుమారి ఆంటీ. కుమారి ఆంటీ హోటల్ గురించి గత కొంత కాలంగా జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. ఇక ఆమె విషయం అటు తిరిగి ఇటు తిరిగి సీఎం వరకూ వెళ్లింది. ఆవిధంగా ఆమె ఇంకా పాపులర్ అయ్యింది. అంతే కాదు ఆమె పెట్టే ఫుడ్ గురించి తీసుకునే డబ్బులు గురించి.. ఆకరికి ఆమె మాట్లాడు మాటల గురించి కూడా పాజిటీవ్, నెగెటీవ్ గా రెండు రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఎవరికి తోచినట్టు వారు ఆమెపే ప్రచారం చేసుకున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియా..యూట్యూబ్ ఛానల్స్ దాటుకుని.. ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ వరకూ ఆమె  పాపులారిటీ పాకినట్టు తెలుస్తోంది. 

 కుమారి ఆంటీ గురించి సోషల్‌ మీడియాలో వచ్చేసరికి ఆమె హోటల్‌కు విపరీతమైన తాకిడి వచ్చింది. టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఆమె హోటల్‌కు వెళ్లిన తర్వాత కుమారి ఆంటీ చాలా ఫేమస్‌ అయ్యింది. దీంతో యూ ట్యూబర్స్‌ అందరూ ఆమె వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్‌ బాగా పికప్‌ అయ్యింది. అదే సమయంలోనే ఆమెకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నదని చెప్పి పోలీసులు అమె హోటల్‌ను మూసేశారు. సీఎం రేవంత్‌ జోక్యంతో మళ్లీ ఆమె హోటల్‌ ప్రారంభమయ్యింది. 

ఇక ఆమె ఇమేజ్ ఎక్కడివరకూ వెళ్ళిందంటే.. ఆమెపే బయోపిక్ డాక్యుమెంటరీ తీసేవరకూవెళ్ళింది. అది కూడా ఆశామాషా ఓటీటీ కాదు.. నెట్ ప్లిక్స్ లాంటి సంస్థ కుమారి ఆంటీపై స్పెషల్ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో  అసలు కుమారి ఆంటీ ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? హోటల్‌ బిజినెస్‌ కంటే ముందు ఆమె ఏం చేసింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయని సమాచారం.  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీని ప్లాన్‌ చేస్తున్నదట! అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు. మరి రెండు మూడు రోజుల్లో వస్తుందేమో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios