చిన్న సినిమాలకు మంచి క్రేజ్ రావాలంటే వారి చేతిలో ఉండే ప్రధాన ఆయుధం ట్రైలర్. గురి తప్పకుండా ఆడియెన్స్ గుండెల్లో గుంచితే ఆ సినిమా ఎంత బోల్డ్ గా ఉన్నా ఎవడు ఆపలేడు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో ఎక్కువగా ఇండస్ట్రీని షాక్ గురి చేసేలా కలెక్షన్స్ రాబడుతున్న చిత్రాల్లో బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలే ఎక్కువ. 

ఇక రీసెంట్ గా విడుదలైన నేను లేను అనే ట్రైలర్ కూడా అదే తరహాలో ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది.దీన్ని చూసాక ఎమ్ ట్రైలర్ రా బాబు అనకుండా ఉండలేరు.  లిప్ లాక్ - ఘాటు రొమాన్స్ అలాగే డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉన్న ఈ ట్రైలర్ లో చివరగా యాక్షన్ సీన్స్ ను కూడా గట్టిగానే కవర్ చేశారు. నటీనటులందరూ పూర్తిగా కొత్తవారు అని అర్ధమవుతోంది. 

ఎక్స్ సినిమాలో డైలాగ్స్ ను బట్టి సినిమా వివిధ జనర్స్ ను గుర్తు చేస్తోంది. నేను చచ్చిపోయాను అని చెప్పే హీరో.. సమాధిలో తేలడం అంతే కాకుండా విధి మా ఇద్దరిని వేరు చేసిందని లవ్ యాంగిల్ ని చూపిస్తూ ఎదో సప్సెన్స్ అన్నట్టు అన్ని యాంగిల్స్లో ట్రైలర్ ను బాగానే కట్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తే ఆ సందేహాలెంటో క్లియర్ గా అర్థమవుతాయి.