విడుదలకు ముందు ట్రైలర్ తో వివాదాలకు దారి తీసింది 'నేను కేరాఫ్ నువ్వు' సినిమా.  ట్రైలర్ లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఓ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొందరు స్టూడెంట్స్ ఈ సినిమాను బ్యాన్ చేయాలని పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లారు. తాజాగా ఈ సినిమాపై సీపీఐ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాకు సెన్సార్ అనుమతి ఇవ్వకూడదని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కించపరిచేలా.. ట్రైలర్ లో అసభ్య పదజాలం 
ఉందని,  సినిమా దర్శకుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ వివాదంపై చిత్ర దర్శకుడు సాగా తుమ్మ స్పందించి అందరినీ క్షమాపణలు కోరాడు. వేరొకరి మనోభావాలు కించపరచడం తన ఉద్దేశం కాదని, తనకు కుల పిచ్చి లేదని అన్నారు.

కొందరు కావాలనే వీడియోను కాపీ చేసి షేర్ చేస్తూ ప్రజల మనోభావాల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోయినా పర్వాలేదని, ప్రజల మనోభావాల్ని కాదని సినిమా రిలీజ్ చేయనని అన్నారు.