తమిళ యువ హీరో విష్ణు విశాల్ పై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయన స్నేహితులతో కలిసి తాగి న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విశాల్ తన స్నేహితులతో అపార్ట్మెంట్ లో మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని పక్క ప్లాట్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను విచారించడం జరిగింది. విష్ణు విశాల్, పిర్యాదు చేసిన వ్యక్తితో వాగ్వాదానికి దిగిన వీడియో విజువల్స్ సైతం మీడియాలో ప్రసారం అయ్యాయి. 


అయితే తాను మద్యం సేవించలేదని విష్ణు విశాల్ పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా విష్ణు విశాల్ ఎఫ్ ఐ ఆర్ నమోదు కాలేదని సమాచారం. తమిళ మీడియాలో విష్ణు విశాల్ సంఘటన హాట్ టాపిగ్ గా మారింది. రాక్షసన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న విష్ణు విశాల్, క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. రానా  హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం అరణ్యలో విష్ణు విశాల్ కీలక రోల్ చేశారు. 

అరణ్య తెలుగు, తమిళ వర్షన్స్ లో విష్ణు విశాల్ నటించడం జరిగింది. కాగా మొదటి భార్యతో విడిపోయిన  విష్ణు విశాల్... బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. గుత్తా జ్వాలా మరియు విష్ణు విశాల్ గత ఏడాది సెప్టెంబర్ లో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. త్వరలో వీరు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.