మెగాహీరోలెవరినీ విడిచిపెట్టలేదు!

neharika konidala comments on mega heroes
Highlights

మెగా ఫ్యామిలీ నుండి హీరోలతో నాగబాబు కూతురు నీహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది

మెగా ఫ్యామిలీ నుండి హీరోలతో నాగబాబు కూతురు నీహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలి చిత్రం 'ఒక మనసు' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ నటన పరంగా నీహారిక మెప్పించింది. అలానే తమిళంలో ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీహారిక మెగా హీరోలపై ఆసక్తికర కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది.

మెగాహీరోలందరిలో ఆమె ఏం నేర్చుకుందనే విషయాలను వెల్లడించింది. ముందుగా చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ.. ''మంచి రిజల్ట్ రావాలంటే హార వర్క్ చేయాలనే విషయం పెదనాన్న చిరంజీవి నుండి నేర్చుకున్నాను.ఎన్ని సమస్యలు వచ్చినా.. ఒక నవ్వుతో వాటిని తరిమేయొచ్చని నాన్న నుండి నేర్చుకున్నా.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలని బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి, ఫ్యామిలీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చరణ్ నుండి నేర్చుకున్నాను.

కోపం ఎక్కడ చూపించాలో వరుణ్ తేజ్ నుండి, అంకితభావంతో ఎలా ఉండాలో అల్లు అర్జున్ నుండి నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక మనకంటే చిన్నవారితో ఎలా ఉండాలనేది సాయి ధరం తేజ్ నుండి, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండాలని అల్లు శిరీష్ నుండి తెలుసుకున్నాను అంటూ ఒక్కొక్కరి గొప్పతనాన్ని తన మాటల్లో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.    
 

loader