మలయాళ, కన్నడ ఇండస్ట్రీలలో నటిగా కొనసాగుతోన్న నేహా సక్సేనా పట్ల ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడికి తగిన బుద్ధి చెప్పింది. సదరు వ్యక్తి వివరాలను సోషల్ మీడియాలో పెట్టేసింది. 

అసలు విషయంలోకి వస్తే.. ఓ కార్యక్రమం కోసం ఆమె అబుదాబికి వెళ్లారు. అక్కడ ఎల్సన్ అనే వ్యక్తి నేహా సక్సెనా ఒక రాత్రికి తనతో గడుపుతుందా దానికి ఒప్పుకుంటే చెప్పమని నేహా మ్యానేజర్ కి మెసేజ్ లు పెట్టాడు.

ఇది గమనించిన నేహా అతడి వివరాలను, ఫోటో, ఫోన్ నెంబర్, చాట్ సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో పెట్టేసింది. ఈ ఊహించని చర్యతో అవాక్కయిన అతడు తన తప్పుని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఫోన్ హ్యాక్ అయిందని, మహిళల పట్ల తానూ ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

దీనిపై అబుదాబి సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. తన కెరీర్ నాశనం అవుతుందని, కుటుంబానికి తెలిస్తే పరువు పోతుందని ఆవేదన చెందుతున్నాడు. కానీ నెటిజన్లు మాత్రం అతడిని దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు.