బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడిప్పుడే వివాదాల నుండి బయట పడుతున్నాడు. కంగనా రనౌత్ కాంట్రవర్సీ సద్దుమణుగుతుందనుకుంటున్న తరుణంలో ఈ స్టార్ హీరో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా లేడీ కమెడియన్ సుముఖి సురేశ్ 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ని టచ్ చేస్తూ ఓ అడల్ట్ జోక్ వేసింది. అమ్మాయిలు రాధికా ఆప్టే లాగా ధైర్యంగా ఉండాలి.

అది స్వయం సంతృప్తిలోనైనా సరే.. సో మీరు ఇంటికి వెళ్లగానే సెక్స్ మ్యూజిక్ ఆన్ చేసుకొని హృతిక్ ని తల్చుకోండి అంటూ బోల్డ్ గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ కామెడీకి హృతిక్ రిప్లై చేస్తూ.. చూడడానికి అసహ్యంగా ఉన్నా ఒక వైపు సంతోషంగా ఉంది. ఆ మూడ్ లో నా పేరుని వాడడం ఓ రకమైన కాంప్లిమెంట్ అంటూ ట్వీట్ చేశాడు. హృతిక్ ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఆ అమ్మాయి బుద్ది లేకుండా జోక్ చేస్తే.. దాన్ని సపోర్ట్ చేస్తూ హృతిక్ రీట్వీట్ చేయడమేంటని అతడిపై మండిపడుతున్నారు. హృతిక్ కి వ్యతిరేకంగా ట్రోలింగ్ కూడా మొదలైంది.