విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని భాష‌ల్లోనూ జులై 26నే విడుద‌ల కానుంది డియ‌ర్ కామ్రేడ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.  అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తైన దగ్గర నుంచి రకరకాల రూమర్స్, ప్రచారాలు మీడియాలో మొదలయ్యాయి.

ఓ ప్రక్కన విజయదేవరకొండ ఈ చిత్రం నిమిత్తం టూర్స్ వేస్తూ మ్యూజిక్ ఫెస్టివల్స్ చేస్తూ ప్రచారం చేస్తూ పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తూంటే , మీడియా మాత్రం చెత్త ప్రచారంతో నెగిటివిటిని వెదజల్లుతోంది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకు విజయ్ దేవరకొండ రిపేర్లు చేసాడని, డైరక్టర్ ని ప్రక్కన పెట్టి తనే రీషూట్స్ చేసాడని అంటోంది. అక్కడితో ఆగక సెకండాఫ్ ఎమోషన్ కంటెంట్ ఎక్కువైందని, అది పడితేనే జనం చూస్తారంటూ చెప్తోంది. 

ముఖ్యంగా హీరోయిన్ క్యారక్టర్ హెవీగా ఉందని, ఎమోషనల్ ప్లే యూత్ కు పడుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఏదైమైనా రిలీజ్ కు దగ్గరపడుతున్న ఈ టైమ్ లో ఇలాంటి కథనాలు ఎంతో కొంత ప్రభావం ఓపినింగ్స్ పై చూపిస్తాయనేది నిజం. కథ ఏంటో కూడా తెలియకుండా ఇలా మాట్లాడటం మాత్రం దారుణమే. 
 
డియర్ కామ్రేడ్ సినిమా ఒకే కాలేజీలో చదువుతున్న  ఓ కాలేజ్ స్టూడెంట్ కు, ఓ మహిళా క్రికిటర్ కు మధ్య జరిగే ప్రేమ కథగా చెప్తున్నారు. కాకినాడ టౌన్ లో జరిగే ఈ కథకు టెర్రిఫిక్ సౌండ్ ట్రాక్ పడిందని , సినిమా సూపర్ గా వచ్చిందని చెప్తున్నారు. 

 ఈ చిత్రంతో క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తానంటూ ధీమాగా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.