సూపర్ స్టార్ మహేష్ బాబు కొందరు భాగస్వాములతో కలిసి 'ఏఎంబి' సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. విలాసవంతమైన స్క్రీన్ లు, అత్యాధునిక వనరులతో ఈ మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చేయడంతో జనాల నుండి మంచి మార్కులు కొట్టేసింది.

నిజానికి ఇందులో మహేష్ వాటా ఇరవై శాతమే అయినప్పటికీ బ్రాండింగ్ పరంగా అతడి పేరు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడి షోలు అన్నీ కూడా వేగంగా ఫుల్ అవుతున్నాయి. అంతా బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ పై కంప్లైంట్ లు వినిపిస్తున్నాయి.

వాహనాల పార్కింగ్ కి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కస్టమర్ల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి. అలానే మల్టీప్లెక్స్ లో పని చేస్తోన్న స్టాఫ్ కి సరైన ట్రైనింగ్ లేకపోవడం కూడా పెద్దగా సమస్యగా జనాలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో క్లాసీ థియేటర్ విత్ పూర్ పార్కింగ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మహేష్ అండ్ టీమ్ గనుక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే మరిన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి సమస్యలతోనే కొన్ని షాపింగ్ మాల్స్ క్రేజ్ తగ్గింది. ఇప్పుడు మహేష్ ఆ మాల్స్ లిస్టులోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి!