కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోలుగా మారి సక్సెస్ రాక ఇండస్ట్రీ నుండి కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. అయితే కమెడియన్ అలీ మాత్రం హీరోగా బ్రేక్ వచ్చినా.. కామెడీ వేషాలు వదల్లేదు.

'యమలీల' సినిమాతో హిట్ కొట్టిన అలీ ఆ తరువాత హీరోయిజం ఉన్న సినిమాల కోసం చూడలేదు. తనకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లాడు. హీరోగా తనకు కెరీర్ లేదని తెలుసుకున్న తరువాత మళ్లీ కామెడీ వేషాలు వేసుకుంటూ తన కెరీర్ ని పొడిగించుకున్నాడు. అప్పట్లోనే అంత మెచ్యురిటీ చూపించిన అలీ.. ఇప్పుడు మాత్రం ఆ ఆలోచన చేస్తున్నట్లు కనిపించట్లేదు.

తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా టీజర్ విడుదలైంది. కొన్ని నెలల క్రితం అలీ హీరోగా 'పండుగాడి ఫోటో స్టూడియో' అనే సినిమా విడుదలైంది. దిలీప్ రాజా అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా టీజర్ లో అలీ విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మాస్ హీరో మాదిరి బౌన్సింగ్ ఫైట్లు చేస్తూ, బిల్డప్ డైలాగ్స్ చెబుతూ భయపెట్టేశాడు.

పైగా ఓ సీన్లో హీరోయిన్ ని కౌగిలించుకొని దొర్లే తీరు చూస్తుంటే మరింత చీప్ గా అనిపిస్తోంది. ఈ టీజర్ చూసిన వారంతా ఈ వయసులో అలీకి ఇలాంటి సినిమాలు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!