Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అందరి మనసును దోచుకుంటూ మంచి రేటింగ్ తో ముందుకు వెళుతుంది. ప్రేమ కథ అంశంతో సాగుతున్న ఈ సీరియల్ ఫిబ్రవరి 25 ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
వాళ్లు అక్కడే కాదు ఇంకెక్కడ మొహాలు ఎత్తుకోకుండా చేయాలి అసలు ఊర్లోనే లేకుండా చేయాలి అంటుంది మాన్సీ. ఊర్లోనే కాదు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అంటాడు అవతలి వ్యక్తి. మరోవైపు మా గురూజీ అంటే ఏమనుకున్నావు? టైంని టైం తో పాటు మనుషుల్ని పరిగెత్తిస్తాడు అంజలి. అసలునాకు ఈ ప్రాజెక్టు వద్దు కానీ ఇంత ఇంట్రెస్టింగ్ గా తప్పు చేస్తున్నాను అంటే దానికి కారణం మా గురూజీ.. ది గ్రేట్ ఆనంద్.
నువ్వేమీ టెన్షన్ పడకు మన ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అంటూ ఫోన్ పెట్టేస్తుంది అంజలి. ఇవన్నీ లోపలి నుంచి విని సంతోషపడుతుంది అను. ఫోన్ పెట్టేసిన అంజలి వంట ఏం చేశావు అని అడుగుతుంది. అన్నీ మీకు నచ్చినవే చేశాను అంటుంది అను. సో స్వీట్ అంటుంది అంజలి. మరోవైపు స్పా స్లాట్ క్యాన్సిల్ అవటంతో ఉసూరు మంటుంది అంజలి. ఏం జరిగింది అని అను అంటే స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది అంటుంది.
పర్వాలేదు మేడం నేను మీకు హెడ్ మసాజ్ చేస్తాను అంటూ ఆమెకి హెడ్ మసాజ్ చేస్తుంది అను. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది దెబ్బకి నా హెడేక్ మొత్తం ఎగిరిపోయింది. ఏదైనా మీ ఆయన చాలా లక్కీ కమ్మగా వండి పెడతావు. అలసిపోతే ఇలాగా సేవలు చేస్తావు అంటుంది అంజలి. నవ్వుకుంటున్న అనుని చూసి మీ ఆయన గుర్తొచ్చాడా.. మీది లవ్ మ్యారేజా.. అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది అంజలి. రెండును అంటుంది అను.
ఈజీగానే మేనేజ్ చేసి ఉంటారు అంటుంది అంజలి లేదు మా పెళ్ళికి చాలా సమస్యలు ఎదురయ్యాయి కానీ మేమిద్దరం ఒకరికి ఒకరు తోడుగా ఉండి మా ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్లాం అంటుంది అను. నాకు ఒక అనుమానం ఒక మనిషితో లైఫ్ లో సంతోషంగా జీవించెయ్యొచ్చు అని ఎలా డిసైడ్ చేస్తారు అంటుంది అంజలి. నమ్మకం మేడం.. తన నడకలో, మాటలో, ప్రేమించే తీరులో నమ్మకం కనిపిస్తుంది. ఆ నమ్మకం ప్రేమని పుట్టిస్తుంది. ఆ ప్రేమ కోసం ఎవరినైనా ఎదిరించాలనిపిస్తుంది అంటుంది అను.
మీకు అలాంటి వాళ్ళు ఎవరూ ఎదురుపడలేదా అంటుంది అను. ఎందుకు పడలేదు ఆనంద్ అనే ఒక మానవుడు ఉన్నాడు. హ్యాండ్సమ్ గా, రెబల్గా నువ్వు చెప్పిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి కానీ ఏం చేస్తాం ఆ ఛాన్సు ఇంకెవరు కొట్టేశారు తనకి పెళ్లి అయిపోయింది ఎన్ని రకాలు పూజలు చేసిందో ఏంటో అంటుంది అంజలి. ఆ మాటలకి నవ్వుకుంటుంది అను. కనీసం అతనికి ఒక బ్రదర్ ఉన్న బాగున్న అతన్ని జ్ఞాపకాలు పోయి పెళ్లి చేసుకునేదాన్ని అంటుంది.
ఆ ఛాన్స్ లేదు నీరజ్ సార్ అంటూ నోరు జారేస్తుంది అను.. మళ్లీ తమాయించుకుని అలాంటి ఛాన్స్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది లెండి అన్నాను అంటుంది. మీ మంచి మనసుకి ఖచ్చితంగా మంచి భర్త వస్తాడు అంటుంది అను. ఈ అంజలి క్యూట్ ఏంజెల్ కదా నాకు ప్రిన్సెస్ ఎక్కడున్నాడో ఏంటో అంటుంది అంజలి. టైం వచ్చినప్పుడు అతనే కళ్ళ ముందుకు వస్తాడు. అప్పుడు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను అంటుంది అను. మరోవైపు ఆనందంగా ఆఫీసుకు వచ్చిన నీరజ్ తన రూమ్ లో మాన్సీ కూర్చోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మాట్లాడుతూ ఉంటుంది.
అది చూసి కోపంతో రగిలిపోతాడు నీరజ్. హౌ డేర్ యు అని ఆమె దగ్గరికి వెళ్తాడు. మాన్సీ నీకోసమే వెయిట్ చేస్తున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీతో ఏదో మాట్లాడాలట అంటుంది కానీ అది ఏది పట్టించుకోని నీరజ్ ఫస్ట్ యు జస్ట్ గెట్ అప్ ఇది చైర్ మాత్రమే కాదు దాదా స్థానం, చూడటానికి ఇదొక వస్తువు కావచ్చు.. కానీ ఇది ఒక అచీవ్మెంట్ దీని మీద కూర్చోవడానికి అర్హత ఉండాలి అంటూ గట్టిగా మందలిస్తాడు. మాన్సీ సారీ చెప్తుంది. మీరేం మాట్లాడాలి అనుకుంటున్నారు అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అడుగుతాడు నీరజ్.
ఏం లేదు సార్ ప్రాజెక్టు స్టార్ట్ అయిన సరియైన ప్రోగ్రెస్ కనిపించట్లేదు అంటారు వాళ్ళు. కొత్త ప్రాజెక్టు గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు నేను ఒకటి చెప్తాను వినండి ఇట్స్ ఇన్ సేఫ్ హాండ్స్. ఏ టీంలో అయినా సమర్థుడు ఒకడు ఉంటాడు ఆ ఒక్కడే సక్సెస్ కి కారణం అవుతాడు అలాంటివాడు అంజలి టీం లో ఒకడున్నాడు అంటాడు నీరజ్. మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మేము చెప్పేదేమీ లేదు లెట్స్ వెయిట్ అండ్ సీ అంటారు వాళ్ళు.
నీరజ్ తో పాటు బయటకు వచ్చిన కేశవ మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అంటాడు. తప్పు జరుగుతున్నప్పుడే సరిదిద్దాలని తెలుసుకున్నాను లేకపోతే పశ్చాత్తాప పడిన కొన్ని తప్పులు సరిదిద్దుకోలేము. నేను అలాంటి ఒక తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను నా కారణంగా ఆగిపోయిన వదినమ్మ సీమంతాన్ని నా చేతుల మీదుగా జరిపించాలి అనుకుంటున్నాను అంటాడు నీరజ్. మీరు అనుకున్నట్లే కానివ్వండి కానీ ఆర్య దీనికి ఒప్పుకుంటాడా అంటాడు కేశవ.
అది నేను చూసుకుంటాను అని నీరజ్ అంటే అయితే ఏర్పాట్లు నేను చూసుకుంటాను అంటాడు కేశవ. మరోవైపు ఆనంద్ ని చూస్తుంటే మామూలుగా కనిపించడం లేదు. వాడికి భాష ఇంద్ర సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సాలిడ్ గా ఉండే ఉంటుంది అంటాడు యాదగిరి అసిస్టెంట్. అదంతా బిల్డప్పు అసలు ఫ్లాష్ బ్యాక్ అంటే నాదే అంటూ బిల్డప్ కొడతాడు యాదగిరి. అప్పుడే కూలీలతో పాటు కలిసిపోయి వస్తాడు మాన్సీ మనిషి. నిన్ను ఎప్పుడూ ఈ సైట్ లో చూడలేదు ఈ ఫోటోలో ఏదో కిరికిరి ఉంది అంటాడు యాదగిరి.
లేదయ్యా ఈ ఫోటో నాదే ఎప్పుడో తీసుకున్నది అంటాడు. ఆ కూలీలలో ఒక వ్యక్తి అతనికి సపోర్ట్ గా ఉంటాడు. అతని రికమండేషన్ తో వెళ్లి పని చూసుకో అంటాడు యాదగిరి. మరోవైపు పురిటి నొప్పులతో బాధపడుతున్న అనుని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు ఆర్య వాళ్ళు. ఆరోజు తిది అష్టమి అవటంవల్ల కంగారు పడతారు అను తల్లిదండ్రులు. తనకి అష్టమి ఘడియల్లోనే నొప్పులు రావాలా తనకి ఏం కాకుండా చూడు అంటూ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది అను తల్లి.
మరోవైపు నొప్పులతో బాధపడుతున్న అను ఒక్కసారిగా దెయ్యం పట్టిందానిలాగా లేచి కూర్చుంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు డాక్టరు, నర్స్. డాక్టర్ ఇంజక్షన్ చేయబోతుంటే వద్దు దగ్గరికి రావద్దు అని హెచ్చరిస్తుంది అను. అయినా ఇంజక్షన్ చేయబోతున్న డాక్టర్ని పీక పట్టుకొని హింసిస్తుంది. అను వద్దు అంటూ బయటినుంచి కేకలు వేస్తారు ఆర్య వాళ్లు. తరువాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.
