అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలయ్యని నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, బాలకృష్ణ లుక్స్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

ఈ చిత్ర టైటిల్ ని చాలా రోజులుగా సస్పెస్ లో పెట్టారు. ఫ్యాన్స్ నిరీక్షణకి తెరదించుతూ నేడు టైటిల్ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. టైటిల్ లాంచ్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర చిన్న ఈవెంట్ నిర్వహించారు. 

ఈ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, రచయిత సాయి మాధవ్, నిర్మాత రవి తదితరులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే టైటిల్ ప్రకటించారు. బాలకృష్ణ సింహా సెంటిమెంట్ కొనసాగిస్తూ ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్, టైటిల్ లోగో అదిరిపోయింది. 

బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి చిత్రాన్ని గుర్తుకు చేసేలా ఈ టైటిల్ ఉంది. నిర్మాత రవిశంకర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉండాలనే ఈ చిత్రానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 

దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారి అభిమాని సినిమా చేస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది ఈ చిత్రం. సమరసింహారెడ్డిని మించేలా విజయం సాధిస్తుంది. ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలుంది. ఇప్పటికి ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంత స్టఫ్ ఉంది ఈ చిత్రంలో. సంక్రాంతికి థియేటర్స్ హోరెత్తిపోతాయి అని గోపీచంద్ అన్నారు. 

Scroll to load tweet…