Asianet News TeluguAsianet News Telugu

మరో భారీ బాలీవుడ్ సినిమాలో నయనతార, డిటేల్స్

నయనతార మొదట్లో గ్లామర్ పాత్రలు చేసినా ఆ తర్వాత రూట్ మార్చి నటనకు అవకాసం ఉన్న పాత్రలు ఎంపిక చేసుకోవటం మొదలెట్టింది. తెలుగులోనూ ‘శ్రీరామరాజ్యం’   ‘అనామిక’ 

Nayanthara to star in another big Bollywood film? jsp
Author
First Published Oct 10, 2023, 9:43 AM IST


నయనతార రీసెంట్ బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘జవాన్‌’లో  ‘నర్మదా రాయ్‌’ పాత్రలో కనిపించింది. సినిమాలో ఉన్నది కాసేపు అయినా గుర్తుండిపోయింది. సినిమా సక్సెస్ మామూలుగా లేకపోవటంతో ఆమెకు బాలీవుడ్ నుంచి పాత్రల వర్షం కురుస్తోందని సమాచారం. అయితే ఆమె మొదటి నుంచి ఏ సినిమా పడితే అది ఒప్పుకోకుండా ఆచి,తూచి అడుగులు వేస్తోంది. తాజాగా ఆమె మరో బాలీవుడ్ చిత్రం కమిటైనట్లు సమాచారం.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. సంజ‌య్ లీలా భ‌న్సాలీ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నయనతారను అడిగినట్లు సమాచారం. ఈయ‌న సినిమాల‌లో టేకింగ్ గాని, విజువ‌లైజేష‌న్ అద్బుతంగా ఉంటాయి. బాలీవుడ్‌లో పిరీయాడిక్ చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. ఈయ‌న తెర‌కెక్కించిన ‘గంగూబాయి క‌తియావాడి’ మంచి సక్సెస్ అయ్యి..  ఆలియా భ‌ట్ కెరీర్ బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇదిలా ఉంటే భ‌న్సాలీ ప్ర‌స్తుతం త‌న నెక్స్ట్ సినిమాను ప‌ట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో ‘బైజూ బావ్రా’ టైటిల్ తో  తెర‌కెక్కించ‌నున్నాడు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, అలియా భట్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు.  దాదాపు ఇరవై ఏండ్లుగా  ‘బైజూ బావ్రా’  స్క్రిప్ట్‌పై తాను పనిచేస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సంజయ్‌లీలా భన్సాలీ.  సంగీత నేపథ్యంలో సాగే కథాంశమిది, ఇద్దరు సంగీత కారుల జీవన సంఘర్షణకు అద్దం పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు సంజయ్‌లీలా భన్సాలీ. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళ‌నుందట‌. రామ్‌లీలా, బాజీరావు మ‌స్తానీ వంటి ల‌వ్ యాక్ష‌న్ సినిమాల‌ను తెర‌కెక్కించిన భ‌న్సాలీ.. ఈ సినిమాని అద్బుతం చేస్తారంటున్నారు అభిమానులు. ఇలాంటి ప్రాజెక్టు కు నయనతార ఓకే చేస్తే మామూలుగా ఉండదు. 

నయనతార మొదట్లో గ్లామర్ పాత్రలు చేసినా ఆ తర్వాత రూట్ మార్చి నటనకు అవకాసం ఉన్న పాత్రలు ఎంపిక చేసుకోవటం మొదలెట్టింది. తెలుగులోనూ ‘శ్రీరామరాజ్యం’   ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్‌’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్‌  సెంట్రిక్‌ ఫిల్మ్‌ అనగానే నయనతార పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్‌’గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios