చిరు చెల్లిగా నయనతార ఫిక్స్
ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు..మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. సుజీత్, వినాయిక్ లతో మొదట ఈ ప్రాజెక్టు అనుకున్నా చివరకు జయం రాజాకు ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు మెగాస్టార్. ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’. 2019 విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇందులో భాగంగా రీమేక్ హక్కులను రామ్‌చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ చేసిన పాత్ర కీలకమైనది. మోహన్ లాల్ చెల్లిగా ఆమె కనిపించింది. తెలుగులో ఈ పాత్ర కోసం మొదట ప్రియమణి అనుకున్నారు. కానీ చివరకు నయనతార ను ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ చిత్రం లాంచ్ కానుందని సమాచారం.
ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు..మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. సుజీత్, వినాయిక్ లతో మొదట ఈ ప్రాజెక్టు అనుకున్నా చివరకు జయం రాజాకు ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు మెగాస్టార్. ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.
ఇక లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్‌కు రెండు పేర్లు ఉంటాయి. అలాగే తెలుగులో కూడా చిరంజీవి పాత్రకు రెండు పేర్లు ఉండబోతున్నాయి. అందులో ఒకటి రాయలసీమకు సంబంధించిన పాత్ర పేరు అని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్‌కు బైరెడ్డి అనే పేరు పరిశీలిస్తున్నారట. దాన్నే పేరు టైటిల్‌గా కూడా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బై రెడ్డి పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే కాబట్టి చిరంజీవి సైతం ఆసక్తి చూపిస్తున్నారట. పొలిటికల్ ఎంటర్ టైనర్‌గా లూసిఫర్ సినిమాను తెరకెక్కించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ కథ నచ్చి తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నాడు.
చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి కూడా త్వరలోనే షెడ్యూల్ లో అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ హిట్ వేదాళం.. అలాగే మలయాళ మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఒకవైపు తెలుగులో మొదటి భాగం రీమేక్ అవుతుంటే మలయాళంలో సీక్వెల్‌ను మొదలు పెట్టే పనిలో ఉండటం విశేషం.