Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కనగరాజ్ నిర్మాతగా సినిమా.. హ్యాండిచ్చిన నయనతార.. ఎందుకు?

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల్లో లియో రానుంది. ఈ క్రమంలో నయనతారతో లోకేష్ కనగరాజ్ నిర్మాతగా నిర్మించనున్న సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
 

Nayanthara out from the film which lokesh kanagaraj Produced? NSK
Author
First Published Oct 8, 2023, 1:58 PM IST

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి భారీ చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న మూవీ ‘లియో’. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగానే.. సూపర్ స్టార్ రజినీకాంత్ తోనూ 171వ చిత్రాన్ని ప్రకటించి అంచనాలు పెంచేశారు. 

ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ గురించి మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో ప్రాజెక్ట్స్ రాబోతుందని తెలుస్తోంది. అయితే లోకేష్ డైరెక్షన్ లో కాదంట. ఆయన నిర్మాతగా పరిచయం కాబోతున్నారని ఆ వార్తల సారాంశం. మరీ డైరెక్టర్ కూడా ఎవరో కాదు.. ఆయన శిష్యుడైన రత్నకూమార్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వనిపిస్తోంది. అలాగే కథ, కథనం బాధ్యతలను నిర్వహించనున్నారని సమాచారం.

అయితే, ఈ చిత్రాన్ని హారర్ర్ అండ్ థ్రిల్లర్ కథా చిత్రంగా నిర్మించబోతున్నారంట. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) , రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని మొన్నటి వరకు సమాచారం. తాజాగా.. మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉందంట. అందుకే సినిమా నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది.

‘జవాన్’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది నయనతార. దీంతో బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని టాక్. మరోవైపు తన సొంత బ్యానర్ లోనూ సినిమా నిర్మాణాలు, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలనూ చూసుకుంటూ బిజీగా ఉంది. అలాగే ఇతర వ్యాపారాలనూ చూసుకుంటూ వస్తోంది. అలాగే తన కవలలను, ఫ్యామిలీతో గడిపేందుకు సమయం తీసుకుంటోంది. వీటంన్నింటి దృష్ట్యా ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios