ఒకప్పటి నటీనటులతో పోలిస్తే ఇప్పటి తారలు బుల్లితెరపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అగ్రనటి నయనతార కూడా బుల్లితెర ప్రేక్షకులనుఅలరించడానికి సిద్ధమవుతుందని సమాచారం.

తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా హాజరు కాని నయనతార ఇప్పుడు టీవీ షోలో కనిపించాలనుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ షోకి సంబంధించి ఒక ప్రోమోని విడుదల చేసింది కలర్స్ టీవీ ఛానెల్. అయితే ఆ ఛానెల్ లో ఏ కర్యక్రమంలో నయనతార పాల్గొనబోతున్నారన్నది సస్పెన్స్ గా ఉంచారు. 

ఈ ఛానెల్ లో ప్రసారం కానున్న ఓ డాన్స్ కార్యక్రమానికి నటి నయనతార అతిథిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక డాన్స్ ప్రోగ్రాంకి రెండు జట్లకు ఇద్దరు అతిథులు ఉంటారు. అయితే ఆ డాన్స్ ప్రోగ్రాంకి వారానికి ఒక కొత్త అతిథి పాల్గొంటారని, అలా ఒక వారంలో నటి నయనతార గెస్ట్ గా పాల్గొనబోతున్నారని టాక్.

ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నయనతార రజినీకాంత్ తో కలిసి 'దర్బార్' సినిమాలో నటిస్తున్నారు. అలానే ఆమె నటించిన 'కొలైయుధీర్‌ కాలం' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.