సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతోంది. వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలదో దుమ్ము రేపుతోంది. రీసెంట్ గా మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టీజర్ తో సందడి చేసింది నయన్.  

 హీరోయిన్ సెంట్రిక్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది న‌య‌న‌తార‌. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్, ఇమేజ్ తో పాటు, రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడున్న హీరోయిన్ల‌లో న‌య‌న‌తార చేసిన‌న్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మ‌రెవ‌రు చేయ‌లేరు. క‌ర్త‌వ్యం, మ‌యూరి, కోకోకోకిల వంటి సినిమాల‌తో హీరో సెంట్రిక్ సినిమ‌ల‌కు ధీటుగా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. 

ఇక ప్ర‌స్తుతం నయన్ న‌టిస్తున్న మ‌రో విమెన్ సెంట్రిక్ మూవీ O2. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈమూవీ నుంచి గ‌త కొంత కాలంగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు మేకర్స్. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా అనేది తెలియక.. కన్ ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. ఇక ఈమూవీ నుంచి బారీ అప్ డేట్ ఇచ్చారు టీమ్. లేటెస్ట్‌గా ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

YouTube video player

తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ ను చాలా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు. నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి కొచ్చిన్‌కు వెళ్తున్న బస్సు లోయలో పడిపోతుంది. అందులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనే నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈమూవీ రిలీజ్ పై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

అయితే ఈసినిమాను థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇటీవ‌లే నయ‌న‌తార న‌టించి నిర్మించిన క‌తువాకుల రెండు కాద‌ల్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని సాధించింది. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో గాడ్ ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తుంది. అంతే కాదు తన ప్రియుడు విష్నేష్ శివన్ తో పెళ్లికి రెడీ అవుతోంది నయన్.