గతంలో శింబు, ప్రభుదేవా వంటి హీరోలతో ఎఫైర్లు సాగించిన నటి నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణంసాగిస్తోంది. చాలా కాలంగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కానీ తమ రిలేషన్షిప్ గురించి ఈ జంట ఎక్కడా పెదవి విప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ ఇద్దరూ సన్నిహితంగా తీసుకున్న ఫోటోలను 
మాత్రం షేర్ చేస్తుంటారు.

ఈ క్రమంలో వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై కూడా ఈ జంట ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరోసారి వీరి ప్రేమ, పెళ్లి గురించి ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనంలో మాత్రమే ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాది డిసంబర్ లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఒకసారి పెళ్లి అయిపోయిందనే పుకార్లు వినిపించాయి. ఇప్పుడు వీరు అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ప్రస్తుతం నయనతార సినిమాల పరంగా చాలా బిజీగా ఉంది.

ఆమె నటించిన 'సైరా' విడుదలకు  సిద్ధమవుతుండగా.. తమిళంలో విజయ్ సరసన ఓ సినిమాలో నటించింది. ఇక తనే ప్రధాన పాత్రలో నటిస్తూ కొన్ని సినిమాలు చేస్తోంది. మరి కెరీర్ పీక్స్ లో ఉన్న ఇలాంటి సమయంలో నయనతార పెళ్లి చేసుకుంటుందా..? లేక ఇవన్నీ పుకార్లేనా అనేది తెలియాల్సివుంది!