సౌత్ లో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం నయనతార లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ కూడా చేస్తోంది. నయన్ నటించిన చిత్రాలన్నీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతున్నాయి. 

మూడేళ్ళ క్రితం నయనతార, జీవా జంటగా తిరుణాల్ అనే తమిళ చిత్రంలో నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. నోవా సినిమాస్ బ్యానర్ లో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని 'వీడే సరైనోడు' టైటిల్ తో తెలుగులో ఈ చిత్రాన్ని ఆగష్టు 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ చిత్రం పెల్లెటూరి కథగా సాగుతుంది. పల్లెటూరి అమ్మాయిగా నయనతార హోమ్లీ లుక్ లో కనిపించింది. జీవా, నయన్ మధ్య రొమాన్స్ ఈ చిత్రంలో ప్రధానాకర్షణగా నిలిచింది.