నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ .. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ని డైరెక్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఏ సినిమా కోసమనేది చూస్తే, 

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తెరపై కనిపించబోతున్నారు. ఆయన తనదైన స్టయిల్‌లో నటన ప్రదర్శించబోతున్నారు. ఆయన్ని లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఇది సర్వత్రా హాట్‌ టాపిక్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. చెస్‌ ఒలింపియాడ్‌ గేమ్స్ కి తమిళనాడు వేదిక కాబోతుంది. ఈ నెల(జులై) 28 నుంచి వచ్చే నెల(ఆగస్ట్) 10 వరకు చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు జరుగనున్నాయి. 

చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరుగనున్న ఈ క్రీడల్లో 186 దేశాలకు చెందిన రెండు వేలకుపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ గేమ్స్ ని తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా భారీగా ప్రచారం చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వం భావించింది. అందుకోసం ప్రత్యేకంగా యాడ్స్ చేస్తుంది. అందులో స్టాలిన్‌ నటిస్తుండగా నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్ చేయబోతున్నారు. 

యాడ్స్ లో స్వయంగా సీఎం స్టాలిన్‌ నటిస్తుండటం విశేషం. ఇటీవల ఈ యాడ్‌ ని నెప్పియార్‌ వంతెన వద్ద చిత్రీకరించారు. దీనికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఆ రకంగా సీఎం స్టాలిన్‌ని విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్ చేశారు. ఇక గత నెలలో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ సాంప్రదాయపద్దతిలో మహాబలిపురంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వెంటనే హనీమూన్‌కి వెళ్లారు. హనీమూన్‌లో అనిలిమిటెడ్‌గా ఎంజాయ్ చేసిన ఈ జంట ఇటీవలే తిరిగొచ్చారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీ అవుతున్నారు.