మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది నయనతార. తాజాగా ఆమె బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది.

లేడీ సూపర్‌స్టార్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నయనతార(Nayanthara). గ్లామర్‌ బ్యూటీగా, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికాలు అందుకుంటోంది. ఒక్కో సినిమాకి నయన్‌ దాదాపు రూ.ఐదు కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం. అంతేకాదు స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో కలెక్షన్లని రాబడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన ఇమేజ్‌ని, మార్కెట్‌ని చాటుకుంటుంది. 

మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది Nayanthara. తాజాగా ఆమె బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేయబోతుంది. జనరల్‌గా హీరోయిన్లు చాలా మంది సినిమాల్లో నటించగా, వచ్చే రెమ్యూనరేషన్‌ని వ్యాపారాల్లో పెడుతున్నారు. రకుల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లు, తమన్నా, కాజల్‌ జ్యూవెల్లరీ షోరూమ్స్ ని నడిపిస్తున్నారు. అలా నయనతార సైతం కాస్ట్యూమ్స్ రంగంలోకి అడుగుపెడుతుందట. 

ఇప్పటికే రాణిస్తున్న ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్‌ రెనిటా రాజన్‌తో కలిసి ఈ రంగంలోకి అడుగుపెడుతుంది. `ది లిప్‌బామ్‌ కంపెనీ` పేరుతో లిప్‌బామ్‌కి సంబంధించి కలెక్షన్స్ ని మార్కెట్‌లోకి తీసుకురాబోతుందట. స్ట్రాంగ్‌ నైపుణ్యం కలిగిన, సైన్స్ పై మంచి అవగాహన కలిగిన డాక్టర్‌ రాజన్‌తో కలిసి ఆమె ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయబోతుండటం విశేషం. ఓ రకంగా నయనతారని ఆ డాక్టర్‌ మార్కెట్‌ పరంగా వాడుకోబోతుందని, అందులో భాగంగా తన బిజినెస్‌లో భాగం చేసుకుందని చెప్పొచ్చు. ఇందులో వందకిపైగా ప్రొడక్ట్ లను తీసుకురాబోతున్నారట. నిత్యం పెదాలు సంరక్షణగా ఉంటూ, కొత్త అందాన్నిచ్చేలా ఈ ప్రొడక్ట్స్ ఉంటాయని అంటున్నారు నయనతార. 

దీనిపై నయనతార స్పందిస్తూ, నా చర్మ సంరక్షణ కోసం సరైన ప్రొడక్ట్ లను ఉపయోగించే విషయంలో రాజీపడను. నా పర్సనల్‌ కేర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ లిప్‌బామ్‌ కంపెనీ అదే డీఎన్‌ఏ విలువలను ఇన్‌కార్పోరేట్‌ చేస్తుంది. డాక్టర్‌ రాజన్‌తో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది నయనతార. 

ప్రస్తుతం నయనతార తెలుగులో `గాడ్‌ఫాదర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె సత్యదేవ్‌ పాత్రకి జోడీగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తమిళంలో ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు జీఎస్‌ విగ్నేష్‌ చిత్రంలో, అలాగే హిందీలో అట్లీ-షారూఖ్‌ సినిమాలో, `కనెక్ట్ `అనే మరో సినిమా చేస్తుంది. మలయాళంలో `గోల్డ్` సినిమాలో కనిపించబోతుంది నయనతార. 

also read: RRR: గట్టిగా గిల్లిన ఎన్టీఆర్..పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మారలేదు.. చరణ్, తారక్ గొడవతో రాజమౌళికి తలనొప్పి