ఇంటర్వెల్ లేకుండా భయపెట్టబోతున్న నయనతార 'కనెక్ట్', ట్రైలర్ ఇదిగో.. ప్రభాస్ క్రేజీ కామెంట్స్
తాజాగా నయనతార మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతోంది. ఈసారి నయనతార హర్రర్ జోనర్ తో రాబోతోంది.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంచుకునే చిత్రాలు వైవిధ్యంగా ఉంటున్నాయి. నయనతార ఇంత క్రేజ్ సంపాదించుకుంది అంటే అందుకు కారణం కేవలం ఆమె గ్లామర్ మాత్రమే కాదు.. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేయడం. కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ నటిగా అబ్బురపరుస్తోంది.
తాజాగా నయనతార మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతోంది. ఈసారి నయనతార హర్రర్ జోనర్ తో రాబోతోంది. నయనతార నటించిన కనెక్ట్ చిత్రాన్ని తెలుగులో యువీ క్రియేషన్స్ సంస్థ పెద్ద ఎత్తున ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కనెక్ట్ ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ అమేజింగ్ గా ఉంది అంటూ ప్రభాస్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక కనెక్ట్ ట్రైలర్ భయపెట్టే విధంగా ఉంది. కనిపించని దెయ్యం భయంతో నయనతార భయపడుతూ నటించడం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ స్నేహితులు అయిన యువి క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీనితో ప్రభాస్ ముందుకొచ్చి ట్రైలర్ లాంచ్ చేశాడు.
అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. కేవలం 90 నిమిషాల నిడివి ఉండే ఈ చిత్రంలో ఇంటర్వెల్ కూడా ఉండదని తెలిపారు. ఇంటర్వెల్ లేకుండా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చిత్రం ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది.