మరోసారి మంచి మనసు చాటుకున్నారు తమిళ స్టార్ కపుల్ నయనతార. విష్నేష్ శివన్. గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిన వీరు.. వీధుల్లో తిరుగుతూ.. పేదవారిని ఏదొ ఒక రకంగా ఆదుకుంటున్నారు. 

మంచి మనసు స్టార్ హీరోయిన్ నయనతారది. పేదవారికి సాయం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందు ఉంటుంది. ముఖ్యంగా.. స్ట్రీట్ చిల్డ్రన్స్.. స్ట్రీట్ బెగ్గర్స్.. ఏదిక్కు లేుకుండా అలా రోడ్డు మీద ఉన్నవారికి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటుంది. ఆమె చేసే మంచి పనిలో తాను కూడా.. నేను సైతం అంటూ..ఓ చేయి వేస్తాడు విఘ్నేష్ శివన్. వీలు కుదిరినప్పుడల్లా ఆమె భర్త విఘ్నేష్ శివన్ తో కలసి చెన్నై నగరంలోని పేదలకు సాయం చేస్తుంటుంది. ఎక్కువగా వీధుల్లో ఒంటరిగా కనిపించే పేదలకు వస్తు సామాగ్రిని పంచుతుంది. 

ఇదే మాదిరి మరోసారి నయనతార తన సేవాభావాన్ని చాటుకుంది. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తుండగా.. భర్త విఘ్నేష్ తో కలిసి ఆమె వీధుల్లో నిరాశ్రయులై ఉన్నవారికి.. అవసరమైన వస్తువులు, తిండి, లాంటివి అందించింది. వర్షంపడుతున్న సమయంలో బస్ షెల్టర్ వద్ద తడవకుండా కూర్చుని సేదతీరుతున్న వారికి సామాగ్రి అందిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్ లో ప్రత్యక్ష్యం అయ్యింది. భర్త విఘ్నేష్ శివన్ ఒక చేత్తో గొడుగు పట్టుకోగా, మరో చేత్తో కవర్ లను పట్టుకున్నాడు. నయనతార ఒక్కోటీ తీసుకుని అక్కడున్న పేదలకు అందిస్తోంది. నయనతార టీ షర్టు, చిరిగిపోయిన జీన్స్ లో కనిపించింది. 

Scroll to load tweet…

గతంలో కూడా వీరు ఇలానే చేశారు. సడెన్ గా రోడ్డు పక్కకు కారు ఆపి.. రోడ్డు పక్కన ప్లాట్ ఫామ్ మీద సేదతీరున్న పేదవారికి గిఫ్ట్ ప్యాక్ లు ఇచ్చింది. ఆ వీడియో కూడా ఇలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతకు ముందు కూడా ఇలానే చేసింది నయన్. ఈ మధ్యలో కూడా కొంత మంది తమ టీమ్ వారికి కూడా సాయం చేసింది నయన్. ఇలా పలు సందర్భాలలో నయనతార తన మంచి మనసు చాటుకుంటుంది. ఇక రీసెంట్ గా తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఈ వీడియోని చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా లేడీ సూపర్ స్టార్ అని ఒకరు అంటే.. వర్షంలో గూడు లేని పేదలకు సాయం చేస్తోందని కొందరు ప్రశంసిస్తున్నారు. గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అని మరో యూజర్ పేర్కొనడం గమనార్హం. నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవలే కుంభకోణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోవడం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో రైలులో ఆమెను ఓ అభిమాని వీడియో తీయబోతుండగా, నయనతార తీవ్ర ఆగ్రదంహం వ్యక్తం చేసింది కూడా.

దాదాపు 5 ఏళ్లు ప్రేమించుకున్ని.. సహజీవనం చేసిన తరువాత లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్. వెంటనే లేట్ చేయకుండా.. అదే ఏడాది సరోగసి ద్వారా కవల పిల్లకు తల్లీ తండ్రి అయ్యారు నయన్, విఘ్నేష్. కాని వారి ఫోటోలు కాని.. వీడియోలు కాని బయట కనిపించడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి వరకూ వారికి సబంధించిన ఫోటో ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. ఇక ఇద్దరు పిల్లలకు ఉయిర్ ఉలగం అని పేరు పెట్టారు స్టార్ కపుల్.