నయనతార కెరీర్ ప్రారంభంలో వచ్చిన ‘చంద్రముఖి’, ‘గజినీ’ సినిమాలు ఆమెకు తెలుగులోనూ ఎంతో పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఆ క్రేజ్ ని ఆసరా చేసుకుని 2006లో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. విక్టరీ వెంకటేష్‌ సరసన ‘లక్ష్మీ’ సినిమాలో సందడి చేశారు. ఆ తర్వాత ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసీ’ తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి. దాంతో ఆమె తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఆ తర్వాత  ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తోపాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు.

‘శ్రీరామ రాజ్యం’ కోసం సీతగా మారి నంది అవార్డు కూడా అందుకున్నారు.  నయన్‌ ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’, ‘దర్బార్‌’ తదితర చిత్రాల్లో కనిపించారు. ఈ నేపధ్యంలో ఆమెను తెలుగు సీనియర్ హీరోల సరసన నటించమంటూ దర్శక,నిర్మాతలు అడుగూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా ఓ సీనియర్ హీరో కోసం ఆమెను అడిగినట్లు సమాచారం. అయితే ఆమె ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా కూడా చేయటం కష్టమని తెగేసి చెప్పిందిట. అందుకు ఆమె డేట్స్ ఖాళీ లేవనే కారణం మాత్రమే చెప్పిందిట. అంతకు ముందు కూడా ఆ హీరోతో ఆమె సినిమా చేసిందిట. ఈ నేపధ్యంలో ఎవరా సీనియర్ హీరో అనేది ఇపడు అంతటా చర్చనీయాశంగా మారింది. 

ప్రస్తుతం ‘నెట్రికన్‌’, ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె సీనియర్ ప్రక్కన వద్దనటానికి కారణం తన పాత్రకు సరైన సీన్స్ , ప్రాధాన్యత లేకపోవటమే అంటున్నారు. అంతేకాదు తన రెమ్యునేషన్ తగ్గించుకోమని అడగుతున్నారట. అమ్మోరు తల్లి వంటి చిన్న సినిమాలు చేసినా ఆమెకు గిట్టుబాటు అవుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించటమే ఆమె పెద్ద సినిమాలు వద్దనుకోవటానికి కారణం అంటున్నారు.