'ఔరా' అనిపించలేదు...కానీ (‘ఐరా’ సినిమా రివ్యూ)

వారానికో దెయ్యం సినిమా డైరక్ట్ గానో, డబ్బింగ్ అయ్యో...ధియోటర్స్ లో దూకుతున్న సమయం ఇది. 

Nayanntara's AIRAA movie review

--- సూర్య ప్రకాష్ జోశ్యుల

వారానికో దెయ్యం సినిమా డైరక్ట్ గానో, డబ్బింగ్ అయ్యో...ధియోటర్స్ లో దూకుతున్న సమయం ఇది. దాంతో దెయ్యం అంటేనే చిన్నచూపు, దెయ్యం సినిమా అంటేనే ప్లాష్ బ్యాక్ తో కూడిన రివేంజ్ స్టోరీ అనే ఫార్మెట్ ని ఇస్తారని జనం ఫిక్స్ అయ్యిపోయారు. చూసే జనంలో ఇంత క్లారిటీ వచ్చినా తీసే జనం మాత్రం దెయ్యాలతో దాంపత్య జీవితం ఎపిసోడ్ మానటం లేదు.

కొద్ది రోజులు గ్యాప్ కూడా ఇద్దామనుకోవటం లేదు. ఇలాంటి ఘోస్ట్ మూడ్ లోనే ఐరా అంటూ నయనతార ఓ దెయ్యం కథని చెప్పటం మొదలెట్టింది. మొన్నీ మధ్యనే డోరా అంటూ డోర్ తెరిచి పారిపోయేలా చేసిన ఈమె ఐరాతో ఔరా అనిపిస్తుందా...ప్రోమోస్, ట్రైలర్స్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ..అదే స్దాయి కిక్ ని,లుక్ ని ఇవ్వగలిగిందా ..లేక పాత దెయ్యాన్నే మనమీదకు వదిలిందా రివ్యూలో చూద్దాం...

 

కథేంటి...

జర్నలిస్ట్ యమున (నయనతార)కు ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని కోరిక. కానీ ఆమె పనిచేస్తున్న సంస్ద ఆ అవకాసం ఇవ్వదు. దాంతో ఓ రకమైన నిరాశలో, పట్టుదలతో...తన నాయనమ్మ ఇంటికి వచ్చిన ఆమె అక్కడ వచ్చిన ఆలోచనతో తనే సొంతగా యూట్యూబ్ ఛానెల్ పెడుతుంది. ఆ ఛానెల్  హిట్ అవటం కోసం ఓ ఆలోచన చేస్తుంది. పాత కాలం ఇల్లళ్లో  దెయ్యాలు ఉన్న ట్లు కొన్ని వీడియోలు క్రియేట్ చేసి వదులుతుంది. దాంతో అవి సూపర్  క్లిక్ అయ్యి..తెగ వ్యూస్ తెచ్చిపెడతాయి.  అయితే ఆ వెంటనే సమస్యలు కూడా మొదలవుతాయి.

నిజంగానే ఆ ఇల్లు దెయ్యాలు తిరుగాడుతున్న ఇల్లు గా మారుతుంది.  మరో ప్రక్క చెన్నైలో  ఓ వ్యక్తి తన చుట్టూ జరుగుతన్న చావులతో కంగారుపడతాడు. దాంతో అందుకు కారణం వెతుకటం మొదలెడతాడు. యమున కూడా తన ఇంటిలో జరుగుతున్న హారర్ సిట్యువేషన్ కు కారణం వెతకటం మొదలెడుతుంది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఒక కామన్ థ్రెడ్ ఉందని అర్దమవుతుంది. ఒకరికి మరొకరి పరిచయం లేని వీళ్లద్దరి సిట్యువేషన్స్ కు ఉన్న లింకేంటి..వీటి వెనక ఉన్న కథేంటి...భవాని (నయనతార డబల్)కు ఈ ఖతకు లింకేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

  (ఇది సస్పెన్స్ కూడిన థ్రిల్ చేసే హారర్...ఇంతకు మించి రివీల్ చేసి కథ చెప్పలేం)

 

బటర్ ఫ్లై ఎఫెక్ట్..

జటిలమైన వ్యవస్దలో ఒక చోట సంభవించే చిన్న మార్పు మరో చోట భారీ  ప్రభావాలకు కారణమవుతుందనే పద్దతినే బటర్ ఫ్లై ఎఫెక్ట్  అంటారు.  అంటే జీవిత గమనంలో ఎప్పుడో జరిగిన ‘చిన్న’ సంఘటన, తరువాత ఒక పెద్ద మార్పుకి దోహదపడతుందని దాని అర్థం. సాధారణంగా తరిచి చూస్తే అందరి జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ప్రభావం ఉండే ఉంటుందని ఈ సిద్దాంతం నొక్కి చెప్తుంది.

ఇక ఈ సిద్దాంతం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే  దర్శకుడు  దీన్నే అనుసరించి ఈ కథను  రెడీ చేసారు.ఆ విషయం మనకు మొదట ఐదు నిముషాల్లోనే హింట్ ఇస్తాడు. సీతాకోక చిలకలతో లింక్ చేయటానికి చూస్తాడు. అయితే హారర్ సినిమాకు వచ్చేటప్పుడు మనం బుర్రని ఇంటిదగ్గరే పెట్టేసి వస్తాం. కాబట్టి ఈ థీరి తెలియని వాల్లకు కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. 

అందుకేనేమో  హారర్ జానర్ సినిమాల్లో తమ తెలివిని చొప్పించటానికి దర్శకులు పెద్దగా ఇష్టపడరు. అందుకే హారర్ సినిమా అనగానే అది సి గ్రేడ్ సినిమా అనే ముద్ర పడి పోయింది. కాస్సేపు భయపెడతారు..లేదా నవ్విస్తారు..అంతకు మించి హారర్ సినిమాలో ఏముంటుంది అనిపించేలా ఓ ఫిక్సెడ్ ఫార్మెట్ తో సినిమా చేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసాడు ఈ దర్శకుడు.

హారర్ కు కూడా ఓ అర్దం..అంతరార్దం ఇవ్వాలని తాపత్రయపడ్డాడు. అయితే ఆ విషయంలోనే తడబడ్డాడు అనిపిస్తుంది. చాలా సోషల్ ఇష్యూలు ఈ సినిమా కథలో కలిపెయ్యాలని ఆత్రుతపడటం సెకండాఫ్ ని కొంచెం ఇబ్బంది పెట్టే అంశం. 

 

నయా..తార..

నయనతార తనను కొత్తగా ఆవిష్కరించేందుకు సరికొత్త కథలను ఎంచుకుంటోంది. ఎంతసేపూ హీరోల ప్రక్కన గ్లామర్ రోల్స్ చేస్తూ , డాన్స్ లకే పరిమితం అయ్యిపోదలుచుకోలేదు. ఆ విషయం గత కొంతకాలంగా రిలీజ్ అవుతున్న ఆమె చిత్రాలు చూస్తే అర్దమవుతుంది.  అందులో భాగంగానే ఒక సినిమా మాత్రమే చేసిన దాదాపు కొత్త దర్శకుడులాంటి సృజన్ కు అవకాసం ఇచ్చింది. అయితే మొన్నే కదా హారర్ సినిమా చేసింది. మళ్లీ అలాంటి సినిమా ఒప్పుకుందంటే అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని అంతా లెక్క వేసుకున్నారు. అలాంటి విషయమే ఈ సినిమాలో ఉంది. అయితే ఎగ్జిక్యూషనే అంత గొప్పగా లేదు. అంటే స్టోరీ లైన్ గా బాగున్న ఈ కథ ట్రీట్మెంట్ కు వచ్చేసరికి దారి తప్పేసిందన్నమాట. 

'ఐరా' అంటే..

నిజానికి ఈ కథలో హీరోయిన్ పేరు గానీ, మరొక అర్దం కానీ ఈ టైటిల్ తో లింక్ అయ్యి ఉండదు.  ఇంద్రుడి వాహనం పేరు ఐరావ‌తం. అందులోనుంచే మేం `ఐరా` అనే ప‌దాన్ని ఎంపిక చేసుకున్నారు. `నయనతార పోషించిన పాత్ర బ‌లాన్ని సూచించ‌డానికి  `ఐరా` అని పేరు పెట్టారు. 

 

మళ్లీ ట్రై చేసారు కానీ..

ఇంతకు ముందు నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన 'కో కో కోకిల' సినిమాలో కమిడియన్ యోగిబాబు, నయనతార మధ్య సన్నివేశాలు పెద్ద హిట్ అయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలోనూ వీళ్లిద్దరు మధ్యన కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు. కానీ అవేమీ పేలలేదు. యోగిబాబు మాగ్జిమం ట్రై చేసాడు కానీ రైటింగ్ పూర్ గా ఉండటం వల్ల ఫన్ ఎలివేట్ కాలేదు. 

 

టెక్నికల్ గా ..

ఇక ఈ సినిమాలో కొన్ని  చోట్ల విజువల్ గా ఎగ్జైటింగ్ గా ఉండే సీన్స్ డిజైన్ చేసారు. కెమెరామెన్ సుందరేశన్ కలర్స్ తో ఆడేసుకున్నాడనే చెప్పాలి. రూమ్ లో  జీరో గ్రావిటీలో వస్తువులు ఎగరటం, ఒకే యాక్షన్ సీక్వెన్స్ రెండు చోట్ల చూపటానికి క్రాస్ కట్స్ చేయటం వంటివి సినిమాకు కొత్త లుక్ తెచ్చాయి. ఇలాంటివి రెగ్యులర్ హారర్ కు దూరంగా ఉండేలా చేసి ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఇక సుందరమూర్తి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే ఎంత టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నా విషయం సున్నాఅయితే కలిసిరానట్లే... ఈ సినిమాకు కథనమే ఇంకొంచె కలిసి వస్తే బాగుండేది.  

 

ఫైనల్ థాట్

తెలివితో చేసే ఈ హారర్ సినిమా ...ఎక్కోడ ఓ పెద్ద హీరోని కదిలించి డేట్స్ ఇప్పిస్తుందని  దర్శకుడు నమ్మి చేసాడనిపిస్తుంది.కానీ ముందు ప్రేక్షకులను ధియోటర్స్ నుంచి బయిటకు వెళ్లనీయకుండా చెయ్యాలి కదా.

 

ఎవరెవరు

 బ్యానర్: గంగా ఎంటర్ టైన్స్ మెంట్స్, కేజీఆర్ స్టూడియోస్ 

నటీనటులు: నయనతార, కళైయ‌ర‌సి,  యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు

కెమెరా:  సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,

ఎడిటింగ్:  కార్తిక్ జోగేష్‌,

స్క్రీన్‌ప్లే:  ప్రియాంక ర‌వీంద్ర‌న్‌

సంగీతం:  సుంద‌రమూర్తి. కె.ఎస్‌. 

నిర్మాత: కోటపాటి రాజేష్ 

కథ,  దర్శకత్వం:  సర్జన్ కె.ఎమ్ 

విడుదల తేదీ: 28-03-2019

రేటింగ్ : 2.5/5

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios