నయని పావని ఎమిలినేటెడ్, కానీ.. ఊహించని ట్విస్ట్ తో సస్పెన్స్ పెంచేసిన నాగార్జున
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో సండే రోజు ఎపిసోడ్ సందడిగా సాగింది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో సండే రోజు ఎపిసోడ్ సందడిగా సాగింది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున వారికి స్వాగతం పలికారు. కాసేపు హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడి నవ్వించారు.
అంతే కాదు అనిల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మిగిలారు. అంటే ఈవారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కాబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది.
వీరి ముగ్గురిలో పూజా సేవ్ అయింది. దీనితో చివరికి నామినేషన్స్ లో అశ్విని, నయని పావని మిగిలారు. శ్రీలీలని పొగుడుతూ భోలే పాట పాడారు. అతడి పాటకి శ్రీలీల ఇంప్రెస్ అయింది. కాసేపు సరదాగా గడిపిన అనంతరం అనిల్ రావిపూడి, శ్రీలీల వెళ్లిపోయారు.
ఇక నాగార్జున మరోసారి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అశ్విని, నయని ముందు రెండు ఫిష్ బౌల్స్ ఉంచారు. వారిద్దరికీ రెండు బాటిల్స్ ఇచ్చారు. ఒక బాటిల్ ని ఫిష్ బౌల్ లో పోయగా ఇద్దరి ఫిష్ బౌల్స్ రెడ్ గా మారాయి. రెండవ బాటిల్ పోసిన తర్వాత అశ్విని ఫిష్ బౌల్ కలర్ మారింది. కానీ నయని ఫిష్ బౌల్ మాత్రం అలాగే రెడ్ కలర్ లో ఉండిపోయింది. దీనితో నయని ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు.
దీనితో నయని వెక్కి వెక్కి ఏడ్చింది. తాను చాలా బాగా ఆడానని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. దీనితో ఆమెని ఇంటి సభ్యులు ఓదార్చారు. వేదికపై నాగార్జున దగ్గరకి వెళ్లిన తర్వాత కూడా నయని ఏడుస్తూనే ఉంది. హౌస్ లో కొద్దీ రోజుల్లోనే అందరితో మంచి బాండింగ్ ఏర్పడింది అని పేర్కొంది. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయింది. ఆమె మాటలకు హౌస్ మేట్స్ కూడా కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు.
అనంతరం నయని పావని బయటకి వెళ్ళింది. అనంతరం నాగార్జున ఒక బాక్స్ తీసుకుని వచ్చి సస్పెన్స్ పెంచేసారు. ఈ బాక్స్ లో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు హౌస్ లోకి వెళతారు అని చెప్పారు. అయితే బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేది బిగ్ బాస్ ఇష్టం అని పేర్కొన్నారు. దీనితో నయని పావని నిజంగానే ఎలిమినేట్ అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ సస్పెన్స్ తోనే నేటి ఎపిసోడ్ ముగిసింది.