Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్‌ బరిలో నయనతార, విఘ్నేష్‌ల సినిమా.. గులకరాయా మజాకా

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ కలిసి నిర్మించిన `కూజాంగల్‌‌` చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచింది. పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సంయుక్తంగా నిర్మించారు. 

nayanathara vignesh shivan produced koozhangal movie selected for oscar nomination
Author
Hyderabad, First Published Oct 24, 2021, 9:44 AM IST

నయనతార(Nayanathara), విఘ్నేష్‌ శివన్‌(Vignesh Shivan)లు హాట్‌ లవ్‌ కపుల్‌గా సౌత్‌లో పాపులర్‌ అయ్యారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలతో హాట్‌ టాపిక్‌గా మారుతున్నారు. అయితే ఈ జోడి ఇప్పుడు ఇండియా వైడ్‌గా వార్తల్లో నిలవబోతున్నారు. అందుకు కారణంగా వీరిద్దరు కలిసి నిర్మించిన `కూజాంగల్‌‌`(koozhangal) చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవడం. పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై Nayanathara, దర్శకుడు Vignesh Shivan సంయుక్తంగా నిర్మించారు. 

ప్రస్తుతం ఈ సినిమా ఇండియా నుంచి oscar Nominationకి వెళ్లేందుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కి వెళ్లేందుకు 14 సినిమాలను వీక్షించగా, అందులో నయన్  నిర్మించిన `కూజాంగల్‌` చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారట. ఈ విషయాన్ని విఘ్నేష్‌ వెల్లడించారు. `అండ్‌ ది ఆస్కార్స్ గోస్‌ టూ.. అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం` అంటూ తన సంతోషాన్నిపంచుకున్నాడు విఘ్నేష్‌. ఇక వచ్చే ఏడాది 94వ ఆస్కార్‌ వేడుక మార్చి నెలలో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో జరగబోతుంది.

`కూళాంగల్‌` చిత కథ విషయానికి వస్తే.. `కూజాంగల్‌`  అంటే గులకరాయి అని అర్థం. భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు‌. 

aslo read; క్లీవేజ్‌ అందాలతో రీతూ వర్మ సంచలనం.. బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్ల కామెంట్‌.. పూజా హెగ్డేకే షాక్

నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. `ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌` (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో ప్రదర్శించబడి `కూజాంగల్‌`  ప్రతిష్టాత్మక టైగర్‌ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ `దుర్గా` తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా `కూజాంగల్‌`  కావడం విశేషం. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ గులకరాయి శబ్దం ఆస్కార్ లో వినిపిస్తుందా? అన్నది చూడాలి. 

also read: నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్?
 

Follow Us:
Download App:
  • android
  • ios