అమెరికా టూర్ లో నయనతార అమెరికాలో ప్రియాంక చోప్రాను అనుకోకుండా కలుసుకున్న నయన్ తారలు కలిసిన వేళ అంతా వెలుగే అంటూ..ప్రియాంకతో పిక్ తో నయనతార ట్వీట్

హాలీవుడ్ లో సత్తా చాటుతున్న మాజీ ప్రపంచ సుందరి. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవలే పలు ఈవెంట్స్ కు హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లింది. ఇదిలా వుంటే.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో తెలుగు, తమిళం మళయాళం అనకుండా అన్ని భాషల్లోనూ తన హవా కొనసాగిస్తున్న హిరోయిన్ నయనతార కూడా ఇఠీవలే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతోంది. 

ప్రియాంక చోప్రా ఇటీవల అమెరికాలో పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా కాలం గడుపుతోంది. ఇటీవల ది పవర్ ఆఫ్ విమెన్ అనే గౌరవాన్ని ప్రియాంక అందుకోవడం ద్వారా ఆక్టావియా స్పెన్సర్, ప్యాటీ జెన్‌కిన్స్, కెల్లీ క్లార్క్సన్, మిచెల్లీ పెఫియర్ లాంటి అగ్ర హాలీవుడ్ తారల సరసన చేరారు. అదే సమయంలో నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో అమెరికా వెకేషన్‌లో ఉంది.

ఈ సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్, అటు హాలీవుడ్ లో సత్తా చాటిన ప్రియాంక ఇద్దరు అమెరికాలో అనుకోకుండా ఎదురుపడ్డారు. నయనతారను చూసిన ప్రియాంక చోప్రా సాదరంగా ఆహ్వానించిందట. సరదాగా కాసేపు గడిపిన ఇద్దరు ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

Scroll to load tweet…