రీసెంట్ గా ఓ స్టార్ హోటల్ లో కలుసుకున్న నయన్, ప్రభు గతంలో పెళ్లి చేసుకుందామనుకున్న ప్రభుదేవా, నయనతార పెళ్లి కాకుండా విడిపోయినా ప్రేమంటే ఇదేరా అంటున్న నయన్,ప్రభు
నయనతార-ప్రభుదేవాల ప్రేమ వ్యవహారం అప్పట్లో పెను దుమారమే రేపింది. వీళ్లిద్దరూ ఒకర్నొకరు పెళ్లి చేసుకునేందుకు చాలా త్యాగాలే చేశారు. నయనతార ఏకంగా మతం మార్చుకుని ప్రేమను చాటితే..ప్రభుదేవా తన భార్యకు విడాకులిచ్చి నయన్ పై ప్రేమ కోసం త్యాగం అంటే ఇదేరా అనిపించాడు. అయితే... సడెన్ గా ఇద్దరి పెళ్లి వ్యవహారం పెటాకులై పోయింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. నయన్ నంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగితే ప్రబుదేవా కూడా బాలీవుడ్ లో అద్ర దర్శకుడిగా ఎదిగాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు.
ప్రభుదేవా-నయనతార కొన్నేళ్ల క్రితం తెగ ప్రేమించేసుకున్నారు. అయితే ఇద్దరికీ పెళ్లి కార్డుతో శుభం పడలేదు. ఎవరి దారి వాళ్లు బతుకుతున్నారు. అయితే... రీసెంట్ గా ప్రభుదేవా నయనతారలు భేటీ అయ్యారు. అనుకోకుండానే అయినా.. ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. తమ దారి తాము చూసుకున్న మాజీ లవర్స్ గా మొహం తిప్పుకుని వెళ్లిపోతారని అంతా అనుకుంటే.. నవ్వుతూ పలకరించుకుని.. కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు వీళ్ల భేటీ ఆంతర్యం ఏంటో అంతు పట్టక చూసేవాళ్లు జుట్టుపీక్కోవాల్సి వచ్చిందట.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. పెళ్లి సంగతి పైకి చెప్పకపోయినా.. ఇండస్ట్రీ జనాలకు అందరికీ ఆ సంగతి తెలుసట. విఘ్నేష్ తో పెళ్లి విషయంలో నయన్ కు కంగ్రాట్స్ చెప్పాడట ప్రభుదేవా. అలాగే కెరీర్ లో దూసుకుపోతున్నందుకు కూడా పనిలోపనిగా అభినందనలు తెలిపాడట ఈ నయన్ మాజీ లవర్.
