Asianet News TeluguAsianet News Telugu

మధుర శ్రీధర్ కేసీఆర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ

  • కేసీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించనున్న దర్శకనిర్మాత మధుర శ్రీధర్
  • ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న మధుర
  • కేసీఆర్ గా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు స్థానంలో నవాజుద్దిన్ సిద్దిఖి పేరు
nawazuddin siddiqui to act in lead role for kcr biopic

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురించి తెలియని వాళ్లుండరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర .. సాధించిన విజయం మరిచిపోలేనివి. పట్టుదలకు .. కార్యదీక్షకు .. సమయస్ఫూర్తికి ప్రతీకగా కేసీఆర్ పేరు చెబుతారు. అలాంటి కేసీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించడానికి నిర్మాత మధుర శ్రీధర్ రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కేందుకు కథ కూడా రెడీ అయ్యింది. దర్శకుడు మధుర శ్రీధర్ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.

 

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తికావడంతో, నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు. కేసీఆర్ పాత్రకి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును తీసుకున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు తెరపైకి వచ్చింది. కేసీఆర్ పాత్రకి నవాజ్ పూర్తి న్యాయం చేస్తాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమా షూటింగ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత జూన్ 2న సినిమా ప్రారంభంకానుంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2018 ఫిబ్రవరి 17న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని దర్శకుడు మధుర శ్రీధర్ వెల్లడించారు.

 

మధుర శ్రీధర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, టీఆర్ఎస్ పార్టీ స్థాపన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం, పోరాటంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, తెలంగాణ సాధన, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, బంగారు తెలంగాణ తదితర అంశాలన్నీ ఉంటాయని మధుర శ్రీధర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios